అమ్మకు ఆ సమయంలో నా మీద కోపం వచ్చింది : జాన్వీ కపూర్

423

ఇండియన్ సినిమా అభిమానుల దృష్టి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌పైనే.ఎందుకంటే ఇప్పుడు ఆమె కథానాయికగా నటించిన తొలి చిత్రం ‘ధడక్‌’ ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అయ్యింది.విజయవంతం అయినా మరాఠీ చిత్రం ‘సైరాట్‌’కు రీమేక్‌ ఇది. శశాంక్‌ కేతన్‌ దర్శకత్వంలో ఇషాన్‌ కట్టర్‌ హీరోగా నటించారు. ‘ధడక్‌’ చిత్రాన్ని ధర్మప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌ జోహార్‌ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను జాన్వీ బయటపెట్టారు.

తల్లి శ్రీదేవి మీద కోపం వచ్చిన ఓ సంఘటనను ‘ధడక్‌’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా మీడియా ముందు చెప్పారు.నాకు దాదాపు పదేళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మ, కమల్‌హాసన్‌గారు నటించిన ‘సాద్మా’ సినిమాను చూశా. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ను అమ్మ గుర్తుపట్టలేక పోయిన సన్నివేశం నన్ను కదలించింది.నువ్వు.. కమల్‌హాసన్‌ను ఎందుకు గుర్తుపట్టలేదు.అంత గొప్ప నటుడుని నువ్వు గుర్తు పట్టలేకపోవడం దారుణం అని అమ్మతో అలిగి రెండు రోజులు మాట్లాడలేదు.

అలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా అమ్మ ఎమోషనల్‌గా నటించిన సినిమాలను నేను చూడను. ఎందుకంటే ఎక్కవగా ఏడ్చే క్యారెక్టర్స్‌నే అమ్మ చేసింది. కానీ ‘సాద్మా’లో అమ్మ ఇంకొకరిని ఏడిపించారు అని చెప్పుకొచ్చారు జాన్వీ.