సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్..

445

దివంగత నటి శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ ‘ధడక్‌’ సినిమాతో హీరోయిన్‌గా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాలో జాన్వీ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.అయితే పెద్ద కూతురు సెట్ అయిపోయింది.మరీ చిన్న కూతురి పరిస్థితి ఏమిటి అని అందరు అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా సినిమాల్లోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి.ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇవ్వనుందని బోనీ కపూర్‌ తెలిపారు. ‘ఖుషీ మొదట మోడల్‌ కావాలనుకుంది. కానీ ప్రస్తుతం తన లక్ష్యం మారింది. అక్క జాన్వీ లాగే తను కూడా హీరోయిన్‌ కావాలనుకుంటోంది.

 

కెరీర్‌ గురించి నిర్ణయం తీసుకోగల పరిపక్వత నా పిల్లలకు ఉంది. అన్షులా, అర్జున్‌, జాన్వీలు తమ సొంత నిర్ణయం మేరకే కెరీర్‌ను రూపొందించుకున్నారు. ఇపుడు ఖుషీ కూడా వారి బాటలోనే నడవాలనుకుంటోందని’ బోనీ కపూర్‌ వ్యాఖ్యానించారు.