చిరంజీవిగారు.. నా జోలికొస్తే పంబ పగిలిపోద్ది : శ్రీరెడ్డి షాకింగ్ కౌంటర్

509

మెగాస్టార్ చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. స్థాయి మరిచి మెగాస్టార్‌పైనే దిగజారుడు వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్‌ అంటే తోకతొక్కిన తాచులా పైకిలేచే శ్రీరెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అంటే కాస్త అభిమానమే. దీంతో ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసేది తప్ప మెగాస్టార్‌పై మాటతూలేది కాదు. అయితే బిగ్ బాస్ స్టేజ్‌పై శ్రీరెడ్డిని పరోక్షంగా మెగాస్టార్ విమర్శించడంతో శ్రీరెడ్డికి తన సహజత్వాన్ని బయటకు తీసి మెగాస్టార్‌ను బండబూతులు తిడుతోంది. సారీ చిరంజీవి గారు.. నేను చాలా స్మూత్‌గానే మాట్లాడుతున్నా.. మంచి గురించి మాత్రమే మాట్లాడుతున్నా.. నా వ్యాఖ్యల్ని తీసుకోండి. మీకు పేరు ఉంది కాబట్టి మేమంతా వెధవలమా? వయసు కాదు జ్ఞానం ఉండాలి’ అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్స్‌ని తొక్కి తొక్కి 13 హీరోస్‌ని కన్నారు. నన్ను కూడా తొక్కుతారా? నన్ను కెలకవద్దు. నా జోలికొస్తే పంబ పగిలి రంభ బయటకొస్తాది’ అంటూ చిరంజీవికే వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి.

Image result for sri reddy

ఇంతకీ శ్రీరెడ్డిని మెగాస్టార్ ఏమన్నారు..? ఆమె కోపానికి కారణం ఏంటంటే.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తమన్నా సింహాద్రి. అవును.. శ్రీరెడ్డిపై మెగాస్టార్ పరోక్షంగా చురకలేసింది ఎక్కడ నుండో బిగ్ బాస్ స్టేజ్ మీది నుండే. ఆదివారం నాడు జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. హౌస్‌లో ఉన్న తమన్నా సింహాద్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తమన్నా. . వెరీ డైనమిక్ గర్ల్. తేడాలొస్తే చీల్చి చెండాడుతావ్. ప్రేమిస్తే.. మనసు ఇచ్చేస్తావ్. తప్పు జరిగితే ఏదైనా సరే.. బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడగలిగే ధైర్య వంతురాలివి నువ్వు. నువ్వు అప్పటి వరకూ ఎవర్ని సపోర్ట్ చేసినా సరే.. వాళ్లు మంచి వ్యక్తుల్ని విమర్శిస్తే.. ఆ ఫ్రెండ్ షిప్‌ని కూడా కట్ చేసుకుని బయటకు వచ్చి నువ్ చేస్తున్నది తప్పు చెప్పే ధైర్యం నీలో ఉన్నది. ఆ విషయంలో నిన్ను అభినందిస్తున్నా. ఇది నీకు నాకు మాత్రమే అర్ధమై ఉంటుంది. ఇంకెవరికీ అర్ధంకాకపోవచ్చు.. కరెక్టేనా?’ అంటూ తమన్నాని ఉద్దేశించి మాట్లాడారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఆ మాటలకు తమన్నా కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఈ మాటలు శ్రీరెడ్డిని ఉద్దేశించి అన్నవని చాలామంది క్యాచ్ చేయడంతో ఇది పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే..శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ లో పెద్ద ఉద్యమం చేస్తది అని అందరు అనుకున్నారు. ఆ సమయంలో ఆమె వెంట చాలామంది సినిమా వాళ్ళు, బయటవాళ్ళు ఉన్నారు. వారిలో తమన్నా కూడా ఒకరు. అయితే పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ తో ఆ ఉద్యమం ఎనేరు గారిపోయింది. ఆ సమయంలో శ్రీరెడ్డి వెనుక ఉన్న తమన్నా, శ్రీరెడ్డిని విభేదిస్తూ బయటకు వచ్చేసింది. నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకో.. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొచ్చావు అవి తమన్నా మీడియా సాక్షిగా శ్రీరెడ్డికి చురకలు అంటించింది. ఇప్పుడు చిరంజీవి మాట్లాడిన మాటలు ఆమెను ఉద్దేశించి అన్నవే అని అర్థం చేసుకుని శ్రీరెడ్డి ఈ విధంగా రియాక్ట్ అయ్యింది. చూడాలి మరి దీనికి మెగా అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో..

ఈ క్రింద వీడియో చూడండి