హరికృష్ణ మృతి గురించి ఎస్పీ చెప్పిన కారణాలు వింటే షాక్

450

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.అయితే ఆయన మరణం ఎలా జరిగింది.దానికి కారణాలు ఏమిటి..ఈ విషయాలన్నీ ఆ జిల్లా ఎస్పీ చెప్పాడు.మరి ఆ ఎస్పీ చెప్పిన విషయాల గురించి తెలుసుకుందామా.

Image result for hari krishna dead body

హరికృష్ణ మరణం గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.యాక్సిడెంట్ అలా జరిగింది ఇలా జరిగింది అని రకరకాల కథనాలు వెలువడుతున్నాయి.వీటన్నిటికి చెక్ పెడుతూ అసలు ఏం జరిగిందో నల్గొండ జిలా ఎస్పీ రంగనాథ్ చెప్పాడు.నందమూరి హరికృష్ణ మృతి పట్ల నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. వేరంగా ప్రయాణించడం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తమ విచారణ ద్వారా తెలుసుకున్నాం అని ఆయన తెలిపారు.హరికృష్ణ ఏ వాహనం తీసుకున్న 2323 అనే నంబర్ ఉంటుందట.ఇప్పుడు ఆయన ప్రయాణించిన కారు నెంబర్ కూడా ఇదే.

Image result for hari krishna dead body

ఏపీ 28 బీడబ్ల్యూ 2323 అనే వాహనంలో ఆయన స్నేహితుడి కొడుకు పెళ్ళికి నెల్లూరుకు బయలుదేరారు.కారుని హరికృష్ణ డ్రైవ్ చేసినట్లు రంగనాథ్ తెలిపారు.ఆయనతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా కారులో ఉన్నారని చెప్పాడు.వాహనం నల్గొండ సమీపంలో చాలా వేగంగా ప్రయాణించినట్లు తెలుస్తోంది.హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోలేదని కూడా రంగనాథ్ అభిప్రాయ పడ్డారు. అందువలనే ఇంతపెద్ద ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాద సమయంలో కారు గంటకు 160 కిమీ వేగంలో ప్రయాణిస్తుంది కూడా తెలిపారు.డివైడర్ ని ఢీకొట్టిన వెంటనే హరికృష్ణ వాహనం గాల్లోకి 15 అడుగుల ఎత్తు ఎగిరిందట.

ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో హరికృష్ణ కారునుంచి 30 అడుగుల దూరంలో పడడం వలన తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.కొందరు స్థానికులు చూసి మాకు సమాచారం అందించడంతో వెంటనే అప్రమత్తం అయ్యాం.వెంటనే వెంటనే నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించినా అప్పటికే పరిస్థితి విషమించి హరికృష్ణ మృతి చెందారు.కారులో ఉన్న మిగిలిన ఇద్దరికీ గాయాలు అయ్యాయని ఎస్పీ రంగనాథ్ మీడియాకు చెప్పాడు.ఇవేనండి ఎస్పీ రంగనాథ్ గారు చెప్పిన ప్రమాదానికి కారణాలు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం గురించి అలాగే ఎస్పీ రంగనాథ్ చెప్పిన విషయాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.