మృత్యువు తో పోరాడి గెలిచిన సోనాలి ఇప్పుడు ఏం చేసిందో చూస్తే హ్యాట్సాఫ్ అంటారు

298

కేన్సర్ తో బాధపడుతున్న సోనాలి బింద్రే కి యావత్ సినీ కుటుంబం అండగా నిలిచింది. ఆమె ఆరోగ్య స్థితి గురించిన విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేసిన వెంటనే సినీలోకం మొత్తం ఆమెకి మనోధైర్యాన్ని ఇచ్చేందుకు ముందుకి వచ్చారు.అయితే ఇప్పుడు సోనాలి బింద్రేకు పూర్తీగా నయం అయ్యింది. కొన్ని నెలలుగా న్యూయార్క్‌లోనే ఉండి క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న సోనాలి.. ఇప్పుడు ముంబైకి వచ్చింది. సోనాలి రాకతో ఆమెను పరామర్శించడానికి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వస్తున్నారు. చాలా రోజులుగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఈమె ఇప్పుడు ఇండియాకు వచ్చింది.

Image result for సోనాలి బింద్రే

మొన్న‌టివ‌ర‌కు ఆరోగ్యంగా క‌నిపించిన సోనాలి బింద్రే ఉన్న‌ట్లుండి క్యాన్స‌ర్ బారిన ప‌డింది. కొన్ని నెలలుగా ఈ భామ న్యూయార్క్‌లోనే ఉంది. అక్క‌డే కొన్ని నెల‌లుగా చికిత్స తీసుకుంటుంది. నిన్నమొన్నటి వరకు కూడా ఈమె ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు ఈమె ఆరోగ్యం కుదుట ప‌డింది. ద‌శ‌ల వారిగా ఆమెకు చికిత్స అందించారు వైద్యులు. చికిత్సకు త్వరగానే స్పందించింది సోనాలి. ఇక ఇప్పుడు కొన్ని నెలల తర్వాత ఇండియాకు వచ్చింది సోనాలి బింద్రే. ఆమెకు అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఘనస్వాగతం పలికారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ ఫోటోలు విడుదలయ్యాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ముంబైలో సోనాలి బింద్రే ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు ఆమె అభిమానులు. పైగా క్యాన్సర్ మహమ్మారితో ఆమె పోరాడిన విధానంపై కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రాణాల మీదకు వస్తున్నా కూడా ఏ రోజు కూడా భయపడలేదని.. తాను ధైర్యంగా పోరాడుతూ ఇప్పుడు ప్రాణాలు కాపాడుకుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆమె మనోధైర్యమే కాపాడిందని చెబుతున్నారు వైద్యులు. ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని సోనాలికి సూచించారు డాక్టర్లు. అవసరం అనుకున్నపుడు మళ్లీ న్యూయార్క్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోనుంది ఈ 43 ఏళ్ల ముద్దుగుమ్మ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. సోనాలి బింద్రే ప్రస్తుతం పరిస్థితి గురించి ఆమె క్యాన్సర్ తో పోరాడిన విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.