కొడుకు బర్త్ డే సందర్భంగా సోనాలి బింద్రే భావోద్వేగ పోస్ట్

399

హీరోయిన్‌ సోనాలీ బింద్రే హై గ్రేడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. శనివారం తన కుమారుడు రణ్‌వీర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతడికి శుభాకాంక్షలు తెలిపారు.

Image result for sonali bendre with son

13వ ఏట అడుగుపెడుతున్న తన కొడుకును పొగడ్తలో ముంచెత్తిన సోనాలీ తొలిసారి రణ్‌వీర్ పుట్టిన రోజున అతడికి దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.రణ్‌వీర్.. మై సన్, మై మూన్, మై స్టార్స్, మై స్కై అంటూ తన కొడుకుపై సోనాలీ ప్రేమను కురిపించింది. నిన్ను చూసి నేనెంత గర్విస్తానో నీకు చెప్పలేను. హ్యాపీ బర్త్ డే. నువ్వు పెద్దోడివి అయ్యావ్.. నిన్ను చాలా మిస్ అవుతున్నా.. అంటూ సోనాలీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

తన కొడుకు రణ్‌వీర్ ఫొటోలను వీడియోగా రూపొందించిన సోనాలి దాన్ని ఇన్‌సాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ పోస్ట్ కు భారీగానే కామెంట్స్ పెడుతున్నారు.రణ్‌వీర్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ సోనాలి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.