సోనాక్షి రివ‌ర్స్ కౌంట‌ర్

417

సోష‌ల్ మీడియాలో ఇటీవల‌ బాడీ షేమింగ్ పై ప‌లు విమ‌ర్శ‌లు నటీమణుల‌పై, సీనియ‌ర్ హీరోయిన్స్ పై వ‌స్తున్నాయి… తాజాగా ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొంటున్నారు న‌టి బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీ సిన్హా..ఇలాంటి కామెంట్స్ చేసే వారికి అదిరిపోయే రిప్లై ఇస్తున్నారు. ఇలా కామెంట్స్ చేసేవారికి ఓ కౌంట‌ర్ ఇచ్చింది ఈ లింగా భామ‌… అదేమిటో తెలుసుకుందాం… చాలా మంది నా లుక్ గురించి కామెంట్లు చేస్తున్నారు.. వేరే వారితో పోల్చుతున్నారు.

Image result for సోనాక్షి

నేను దీనిని నాణానికి రెండు వైపులా అనే భావనతో చూస్తుంటాను. చిన్నప్పుడు నేను స్థూలకాయురాలిగా ఉండేదానిని. అయితే నేను ఇంత బరువున్నానని ఎప్పుడూ ఇబ్బంది పడిందేలేదు.. కాని కొంద‌రు మాత్రం నా బ‌రువు నేను ఎంత లావు ఉన్నాను అనే దానిపై ప్ర‌శ్నిస్తుంటారు.. నాకు టాలెంట్ కి బ‌రువుకి లావుకి ఎక్క‌డా సంబంధం ఉండ‌దు.. ఒక‌రి లుక్ ని చూసి కామెంట్లు చేయ‌డం క‌రెక్ట్ కాదు… ఇది ఈ మ‌ధ్య చాలా ఎక్కువ‌గా చ‌ర్చిస్తున్నారు. లుక్ చూడ‌టం అనేది అవ‌కాశాల‌కు ఎటువంటి కార‌ణం కాదు… వారి న‌ట‌న పైనే ఆధార‌ప‌డి ఉంటుంది.. నేను నాకు ఏది మంచిది అనిపిస్తే దానిపైనే దృష్టిపెడ‌తాను.. ఇత‌రుల కామెంట్లు ప‌ట్టించుకోను. నాకు నేనుగా ఇలాంటివి ప‌ట్టించుకుని ఒత్తిడి పెంచుకోను అని ఓ కౌంట‌ర్ ఇచ్చింది ఇటువంటి కామెంట్లు చేసేవారికి.