కేజీఎఫ్ హీరో హత్యకు కుట్ర.. భారీగా సుపారీ కన్నడలో అరెస్టులు

291

క‌న్న‌డ స్టార్ హీరోగా ఆయ‌న ఓ వెలుగు వెలుగుతున్నాడు, సినిమా అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా వ‌స్తున్ స‌మ‌యంలో, మంచి హిట్స్ కూడా ఆయ‌న ఖాతాలో వేసుకున్నాడు… ఈ స‌మ‌యంలో కేజీఎఫ్ హీరో, కన్నడ రాక్ స్టార్ యష్ హత్యకు కుట్రపన్నారనే వార్తలు కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసాయి. యష్ చంపేయడానికి పథకం రచించారనే వార్తలు మీడియా, సోషల్ మీడియాలో చెలరేగిపోవడంతో గందరగోళంగా మారింది. దాంతో హడావిడిగా యష్ శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. ఇలాంటి వార్తలు మీడియాలో స్వైర విహారం చేయడానికి ముందు అసలేం జరిగిందంటే..

Image result for yash hero

కర్ణాటకలో ఎన్నికల ముందు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులో తీసుకొనే డ్రైవ్‌ను నిర్వహించారు. ఆ నేపథ్యంలో భరత్ అనే కరడు గట్టిన రౌడీషీటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆ సందర్భంగా యష్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారు. అందుకు భారీగా సుపారీ ఇచ్చారనే క్రమంలో భరత్‌ను అరెస్ట్ చేశారనే వార్త సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాలో భగ్గుమన్నది.యష్ హత్యకు కుట్ర వార్త అదుపుతప్పడంతో కేజీఎఫ్ హీరో స్పందించాడు. ఆ వార్తలో వాస్తవం లేదు. ప్రతీసారి అసాంఘీక శక్తులను పోలీసులు అరెస్ట్ చేయడం సర్వసాధారణం. ఆ క్రమంలో నా హత్యకు కుట్ర వార్త వెలుగులోకి వచ్చింది. ఈ వార్త నా అభిమానులను చాలా హర్ట్ చేసింది. వారంతా ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి వార్తలను దయచేసి మీడియా ప్రసారం చేయవద్దు అని యష్ కోరారు.

ఈ క్రింది వీడియో చూడండి 

నా హత్యకు కుట్రపన్నారనే వార్త ఎలా, ఎక్కడ పుట్టిందో అర్థం కావడం లేదు. ఒకవేళ ఇదే నిజమైతే వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వారిని అరెస్ట్ చేయించడానికి దోహదపడాలి. కానీ మీడియాలో ప్రసారం చేస్తే ఎలాంటి లాభం ఉండదు. నేను హోంమంత్రితో మాట్లాడగా అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు అని యష్ వెల్లడించారు.నా ప్రత్యర్థులు వ్యూహ రచన అనడానికి కూడా ఆస్కారం లేదు. ఇండస్ట్రీలో మంచి ఆరోగ్యకరమైన పరిస్థితి ఉంది. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే వ్యక్తులు కన్నడ సినీ పరిశ్రమలో లేరు. రెండేళ్ల క్రితం నా కారుపై కొందరు మూకలు రాళ్లు రువ్వారు. ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు తగిన చర్యలు తీసుకొన్నారు అని యష్ గుర్తు చేశారు.ఇదిలా ఉండగా, యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకొన్నది. దాదాపు రూ.200 కోట్లకుపైగా వసూళ్లను సాధించి కన్నడ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. త్వరలోనే కేజీఎఫ్ చాప్టర్2 సెట్స్‌పైకి వెళ్లనున్నది.