ఈ సినిమా పెళ్లికాని వారికి కోరిక పుట్టించడం గ్యారెంటీ..సితార

499

టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు ఎంతగానమో ఎదురుచూస్తున్న సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’.‘శతమానం భవతి’దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్, అందాల భామ రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.ఈ మూవీ ఫస్ట్ లుక్ మొదలుకొని, టీజర్, ట్రైలర్లతో జనాల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేశాడు చిత్ర నిర్మాత దిల్ రాజు. చిత్ర యూనిట్‌తో పాటు కొంత మంది శ్రేయోభిలాషుల మధ్య ఈ స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. ఈ సినిమా చూసిన అందరూ చిత్ర యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆ తరువాత ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా నటి సితార కూడా ఈ ప్రెస్ మీట్‌లో మాట్లాడింది.

ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాగా నిలుస్తుందని ఆమె చెప్పారు. తన 33 ఏళ్ల సినీ కెరీర్‌లో తనకు చాలా దగ్గరయిన సినిమాలు కొన్నే కాగా అందులో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని ఆమె చెప్పింది. పెళ్లి కాని వారు ఈ సినిమా చూస్తే పెళ్లి చేసుకోవాలనే కోరిక వారిలో పుట్టడం గ్యారెంటీ అంటూ ఈ సినిమాపై ఆమె ఎంత కాన్ఫిడెన్స్‌గా ఉందో చెప్పింది.మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగష్టు 9 వ తేది వరకు ఎదురుచూడాల్సిందే..