35 రోజులు చీక‌ట్లో సైరా

468

సైరా సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది… ఇప్ప‌టికే అనుకున్న షెడ్యూల్స్ ని అన్నింటిని వ‌రుస‌పెట్టి పూర్తి చేస్తున్నారు.ఈ సినిమాలో అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న విష‌యం తెలిసిందే…సైరా నరసింహారెడ్డి చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Image result for sye raa narasimha reddy

చిరంజీవితో పాటు అగ్ర‌క‌థానాయిక నయనతార, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుధీర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు… రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమా 35 రోజుల షెడ్యూల్‌ పూర్తయినట్లు రత్నవేలు తెలిపారు. ఈ సందర్భంగా సెట్‌లో తీసిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు..35 రోజులుగా స‌వాలుతో కూడిన షెడ్యూల్ పూర్తి చేశాము అని అన్నారు ఆయ‌న‌.

Image result for sye raa narasimha reddy
చాలా త‌క్కువ వెలుగులో ఈ షూటింగ్ పూర్తిచేశాము అని తెలియ‌చేశారు…. ఈ ఫోటో చూస్తుంటే చీక‌టిలో గుర్రాల‌పై వెళుతున్న ఫోటో క‌నిపిస్తోంది. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక ప్రచార చిత్రం విడుదల చేసే అవ‌కాశం ఉంది.. ఈ సినిమాని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయ‌నున్నారు అని తెలుస్తోంది.