రెండో పెళ్ళికి సిద్దపడ్డ సింగర్ సునీత..

717

తెలుగులో గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తూ తెలుగు ప్రజల మనసు దోచుకున్న సింగర్ సునీత.అయితే ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.సునీతకు ఇది వరకే పెళ్లి అయ్యింది.సునీతకి 19 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది.అయితే ఇద్దరి మద్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితమే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.

ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు.గత కొన్నాళ్లుగా ఆమె పెళ్లి విషయం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెకు కాబోయే భర్త ఐటీ కంపెనీ యజమాని అని, ఆయన కూడా ఇదివరకే విడాకులు తీసుకున్నారని సమాచారం. ఇప్పటి వరకూ పెళ్లి విషయాన్ని సునీత అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు.

సునీత ఇన్నాళ్లూ పిల్లలే ప్రాణంగా బతికారు.పిల్లలు పెద్దవాళ్ళు అవుతుండడంతో సునీత మరో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది.ఎందుకంటే వాళ్ళకు తండ్రిలాంటి వ్యక్తి ఆసరా ఇప్పుడు అవసరం అని ఆమె భావిస్తుంది.సునీత సరైన నిర్ణయం తీసుకున్నారని ఆమె గురించి తెలిసినవారు అభిప్రాయపడుతున్నారు.