సింగ‌ర్ సునీత ఫైన‌ల్ గా త‌న మ‌న‌సులో విష‌యం చెప్పేసింది

824

టాలీవుడ్ లో వార్త‌లు ఎలా ఉన్నా, రూమ‌ర్లు మాత్రం తూటి మొక్క‌ల్లా విస్త‌రిస్తూనే ఉంటాయి.. ఇక హీరో హీరోయిన్ల పెళ్లి విష‌యాలు అలాగే వారి లైఫ్ సీక్రెట్స్, అలాగే వారు డేటింగ్ లో ఉన్నారా ఇలాంటి వార్త‌లు పుట్టుకొస్తూనే ఉంటాయి..తాజాగా సినీ గాయని సునీత రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. దీనిపై ఆమె తాజాగా ఫేస్ బుక్ లైవ్ లోకి వ‌చ్చి స్పందించారు.

Image result for singer sunitha
తాను రెండ‌వ వివాహం చేసుకుంటున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని ఇవ‌న్నీ రూమ‌ర్లు అని నిజంగా అలాంటిదేదైనా ఉంటే ముందుగా ప్రకటిస్తానని చెప్పారు. అవార్డులు వచ్చినప్పుడు కూడా ఇన్ని మెసేజులు రాలేదని ఆమె అన్నారు. తన భర్తతో విడాకులు తీసుకుని చాలా రోజులైందన్నారు. తనకు రెండో పెళ్లి ఆలోచన లేదని, ఇలాంటి వార్తలను నమ్మొద్దని సునీత సూచించారు.

Image result for singer sunitha

40 ఏళ్లకు చేరువైన సింగర్ సునీతకు 20 ఏళ్ల కుమారుడు ఆకాష్, 17 ఏళ్ల కుమార్తె శ్రేయ ఉన్నారు. 19 ఏళ్ల వయసులో ఆమె కిరణ్ ను వివాహం చేసుకున్నారు. కాని కొన్నికార‌ణాల వల్ల వారు విడాకులు తీసుకున్నారు. ఇప్ప‌టికే కొన్ని వంద‌ల పాట‌లు పాడిన ఆమె డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చేశారు.. రాశి, భూమిక, అనుష్క, జ్యోతిక, ఛార్మి, మీరా జాస్మిన్, లైలా, సోనాలీ బెంద్రే, సౌందర్య, రిచా గంగోపాధ్యాయ్, శ్రియ, స్నేహ, జెనీలియా, కత్రినా కైఫ్, తమన్నా, ఇలియానా, కమిలినీ ముఖర్జీ, త్రిష, నయనతార ఇలా ప్ర‌ముఖ హీరోయిన్ల‌కు ఆమె సినిమాల‌కు డ‌బ్బింగ్ చెప్పారు. ఇక ఈ రూమ‌ర్ల‌కు ఫుల్ స్టాప్ పెట్ట‌డం బెట‌ర్ అని అంటున్నారు జ‌నాలు.