నేను 9 ఏళ్ల వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా..టాప్ సింగర్..

321

ఇప్పుడు ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. హాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం భారతీయ ఇండస్ట్రీలో కూడా ప్రకంపణాలు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై నానా పాటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపించిన అనంతరం మరోసారి దేశవ్యాప్తంగా ‘మీటూ’ కాంపెయిన్ ఉధృతం అయింది.తాజాగా సింగర్ చిన్మయి కూడా ఈ విషయం మీద స్పందించింది.మరి ఆమె ఏమన్నదో చూద్దామా.

Image result for singer chinmayi

తెలుగు ఇండస్ట్రీలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద అంటే అందరికి పరిచయమే. ఈ అమ్మడు కెరీర్ లో ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. అంతే కాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ నెంబర్ వన్.అయితే మీ టూ ఉద్యమం ఇప్పుడు బాగా నడుస్తుంది.ప్రతి ఒక్కరు ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి చెప్తున్నారు.దీనిపై చిన్మయి స్పందిస్తూ..తాను తొమ్మిదేళ్ల వయసులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు చిన్మయి తెలిపారు. మా అమ్మ తన డాక్యుమెంటరీకి సంబంధించి రికార్డింగ్ సెషన్ సూపర్ వైజ్ చేస్తూ బిజీగా ఉంటే నేను పక్కన రూములో పడుకుని ఉన్నాను. ఓ వ్యక్తి నా ప్రైవేట్ పార్ట్ టచ్ చేసి రాక్షసానందం పొందాడు. వెంటనే నేను ఉలిక్కిపడి లేచాను.

Image result for singer chinmayi

తర్వాత మా అమ్మకు ఆ అంకుల్ గురించి చెప్పాను.మహిళలు ప్రతి రోజూ, ప్రతి చోటా ఏదో ఒకరకంగా లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ప్రతి రోజూ జరిగిన సంఘటనలు గుర్తుంచుకోవడం చాలా కష్టం. చెడు ఉద్దేశ్యం లేని హగ్ ఒకే కానీ వారిలో ఎలాంటి ఉద్దేశ్యం ఉందో మనం పసిగట్టడం చాలా కష్టం అని చిన్మయి వ్యాఖ్యానించారు.నేను టీనేజ్ లో ఉన్న సమయంలో కొంత మంది తన జేబులో చేయి పెట్టి ఏముందని ఆటపట్టించే వారు..అప్పడు అర్థం అయ్యేది కాదు. అది ఎంతో తప్పుడు ఉద్దేశం అని తర్వాత తెలిసి బాధపడ్డాను.19 ఏళ్ల వయసులో మరోసారి వేధింపులకు గురయ్యాను. ఒక ఓల్డ్ మ్యాన్ ఒక కారణంతో తన ఆఫీసుకు పిలిచాడు.

ఆ మనిషి చాలా మంచి వాడని భావించాం..తనతో ఒంటరిగా మాట్లాడాలని పిలిపించుకొని తనను కౌగిలించుకొని అసహ్యంగా ప్రవర్తించాడు..అప్పుడు అర్థం అయ్యింది..అతగాడి క్యారెక్టర్. ఇలా జీవితంలో ఎన్నో వొడిదుడుకులు లైంగిక వేధింపులు భరించాల్సి వచ్చింది..సామాన్యులైనా..సెలబ్రెటీలు అయినా..ఆడవారికి ఈ అవమానాలు తప్పడం లేదని వాపోయింది.ఇలా చిన్మయి తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి చెప్పింది.మరీ ఈ విషయం గురించి మీరేమంటారు.సమాజంలో ఆడవాళ్ళూ ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి అలాగే మీ టూ ఉద్యమంలో భాగంగా నటీమణులు చెప్తున్నా విషయాల గురించి అలాగే చిన్మయి చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.