హీరోయిన్ అవతారమెత్తబోతున్న సింగర్ గీతా మాధురి

363

బిగ్ బాస్ 2 ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ మారింది. రోజు రోజుకు ఇంట్లో గొడవలతో షో రక్తి కడుతుంది.చాలా మందికి ఈ షో వల్ల ఎంత ఫేమస్ అయినా కాకున్నా…కొందరికి మాత్రం ఎంతో పేరు సంపాదించి పెట్టింది.అందులో కౌశల్ గీతామాధురి ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు.బిగ్ బాస్ కు వెళ్లకముందే గీతామాధురి ఫెమస్.కానీ బిగ్ బాస్ కు వెళ్ళాక అసలు గీతామాధురి ఏమిటో అందరికి అర్థం అయ్యింది.ఆమె బిహేవియర్ కు ఫాన్స్ అయినా వాళ్ళు చాలా మంది ఉన్నారు.

Image result for geetha madhuri nandu

ఈ ఫేమ్ ని ఉఫయోగించుకుని గీతా క్యాష్ చేసుకోవాలని చూస్తుంది.ఇటీవలే నందు నటించిన ఎందుకో ఏమో మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా నిర్మించి, దర్శకత్వం వహించిన వడ్డినేని ఫ్యామిలీ.అయితే ఈ ఫామిలీ ఇప్పుడు మరొక సినిమాను చెయ్యడానికి సిద్ధమవుతున్నారు.ఆ సినిమాను గీతా మాధురితో ప్లాన్ చేస్తున్నారట..ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతుంది. వాస్తవంగా జరిగిన ఓ క్రైం స్టోరీ తీసుకుని సినిమాకి తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారంట.ఈ విషయం గీతా భర్త నందుకు చెబితే అతను ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

Image result for enduko emo movie

ఎందుకో ఏమో మూవీకి దర్శకత్వం వహించిన కోటి వడ్డినేని ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారంట. మాలతి వడ్డినేని నిర్మాత. గీతా మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే 15 రోజులు గ్యాప్ తీసుకుని ఈ షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం.మరి ఈ సినిమా విషయంలో గీతామాధురి ఏమంటుందో చూడాలి.