రజినీకి ఒకే చెప్పిన సీనియ‌ర్ హీరోయిన్

431

ఓప‌క్క రాజ‌కీయ పార్టీతో బీజీగా ఉండి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటికి సిద్దం అవుతున్నారు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్.. ఇక ఆయ‌న సినిమా అంటేనే త‌మిళ ఇండ‌స్ట్రీతో పాటు దేశ‌వ్యాప్తంగా ఆయ‌న అభిమానులు ఎంతో ఎదురు చూస్తారు.. ఇక ఇటీవ‌ల రోబో 2 సినిమా విడుద‌ల పై ఓ క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్ .. ఇక తాజాగా కార్తీక్ సుబ్బరాజు ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్తి అయింది.. ఇటీవ‌ల ఈ షూటింగ్ డార్జిలింగ్ లో చిత్రీక‌రించారు… ఇక త్వ‌ర‌లో ఈ సినిమా రెండోవ షెడ్యూల్ స్టార్ట్ అవ‌నుంది.

Image result for rajini kanth

ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్. విజయ్ సేతుపతి , బాబీ సింహ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు..అయితే తాజాగా చిత్ర‌యూనిట్ తెలుపుతున్న దాని ప్ర‌కారం ఈ సినిమాలో మ‌రో ఇద్ద‌రు జాయిన్ కానున్నారు అని తెలుస్తోంది.. సౌత్ ఇండియాలో సీనియ‌ర్ హీరోయిన్ అయిన సిమ్రాన్ తో పాటు బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

Image result for simran actor

ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది.. ఈ సినిమా వ‌చ్చే ఏడాది వేస‌వికి రిలీజ్ కానుంది.. ఇక ఈ సినిమా షూటింగ్ స్పీడుగా పూర్తి చేసి ఫుల్ టైం రాజకీయాల్లో ర‌జినీ బిజీగా ఉంటారు అని తెలుస్తోంది. ఇక ఇదే త‌లైవా చివ‌రి చిత్రం కావ‌చ్చు అని కోలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి..