సైమాలో బాహుబలికి అవార్డుల పంట. ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయో చూడండి

352

బాహుబలి2 చిత్రం సైమా అవార్డుల్లో విజయ కేతనం ఎగురవేసింది. పలు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది.ఏ ఏ విభాగాల్లో అవార్డులు వచ్చాయంటే..ఉత్తమ తెలుగు చిత్రంగా బాహుబలి ది కన్‌క్లూజన్ ఎంపికైంది. ఆ అవార్డును నిర్మాత శోభూ యార్లగడ్డ అందుకొన్నారు. అలాగే ఉత్తమ దర్శకుడిగా బాహుబలి చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి అవార్డును గెలుచుకొన్నారు.

ఉత్తమ నటుడిగా ప్రభాస్

ఉత్తమ నటుడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఉత్తమ విలన్‌గా బాహుబలిలో నటించిన రానా దగ్గుబాటి అవార్డును సొంతం చేసుకొన్నారు. ప్రభాస్, తనకు వచ్చిన అవార్డును కూడా రానానే తీసుకున్నాడు..నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్ ఉత్తమ నటిగా ఎంపికైంది. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని నిర్మించిన రాజీవ్ రెడ్డి ఉత్తమ నిర్మాతగా ఎంపికయ్యారు. క్రిటిక్స్ విభాగంలో గౌతమి పుత్ర శాతకర్ణి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. క్రిటిక్స్ విభాగంలో గౌతమి పుత్ర శాతకర్ణి చిత్ర శాతకర్ణికి ఉత్తమ నటుడి అవార్డును నందమూరి బాలకృష్ణ అందుకొన్నారు.

ఉత్తమ నటిగా కాజల్

ఉత్తమ సహాయనటిగా భూమిక చావ్లా (ఎంసీఏ), ఉత్తమ తొలి చిత్ర నటుడిగా రోగ్ చిత్రానికి ఇషాన్ అందుకొన్నారు. ఉత్తమ తొలి చిత్ర హీరోయిన్‌గా కల్యాణి ప్రియదర్శిని హలో చిత్రానికి అందుకొన్నారు. ఉత్తమ హాస్యనటుడిగా రాహుల్ రామకృష్ణ (అర్జున్ రెడ్డి), ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ సంగీతదర్శకుడిగా కీరవాణి (బాహుబలి) ఎంపికయ్యారు. ఇంకా పలు విభాగాల్లో బాహుబలికి అవార్డులు లభించాయి.