పాప్ సింగర్ తరహాలో రెచ్చిపోయి పాట పాడిన శ్రుతిహాసన్..

308

శృతి హాసన్..కమల్ హాసన్ నట వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.తండ్రికి తగ్గ నటి అని పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలలో నటించడం తగ్గించి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. శృతి హాసన్ కేవలం నటనలోనే కాదు సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. తన తండ్రి కమల్ హాసన్, వెంకటేష్ కలసి నటించిన ఈనాడు చిత్రానికి శృతి హాసన్ సంగీతం అందించింది. పలు చిత్రాల్లో కొన్ని పాటలు కూడా పాడింది.

Image result for shruti hassan eenadu

ఆ తరువాత శృతి హాసన్ స్టార్ హీరోయిన్ తెలుగు, తమిళ భాషల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. పలు సూపర్ హిట్ చిత్రాలలో శృతి హాసన్ నటించింది.పెద్ద పెద్ద హీరోలందరిని కవర్ చేసింది.ఇటీవల శృతి హాసన్ కు సరైన విజయం లేకపోవడంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.తండ్రితో కలిసి శబాష్ నాయుడు చేస్తుంది.లండన్ కు చెందిన మైఖేల్ కోర్ల్సేతో శృతి ప్రేమాయణం నడుపుతుంది.

తాజాగా శృతి హాసన్ లోని గాయానికి మరోమారు బయటకు వచ్చింది. లండన్ లో ఓ మ్యూజికల్ షోలో లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చి అదరగొట్టింది. అది కూడా వెస్ట్రన్ మ్యూజిక్ తో. పాప్ సింగర్ తరహాలో శృతి హాసన్ రెచ్చిపోయి ఈ సాంగ్ పాడింది.ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.