దీప్తి సునైనాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ఒక్కో రోజుకి ఎంతో తెలుసా..

849

బిగ్ బాస్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.అయితే ఈ షో లో పాల్గొన్న వారికి భారీగానే రెమ్యునరేషన్ ముట్టజెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ ఇంటిలో ఎక్కువగా పారితోషికాన్ని పొందేది గీతా మాధురి అనే గాసిప్ ప్రచారంలో ఉంది. ఎవరికి ఎంత ఇస్తున్నారనే విషయంపై అధికారికంగా సమాచారం లేదు.

కానీ ఇటీవల బిగ్‌బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయినా సంజనా అన్నె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీప్తి సునైన తీసుకొనే రెమ్యునరేషన్ గురించి వెల్లడించింది.ఆమె ఏం చెప్పిందంటే..నేను దీప్తి సునైన బిగ్‌బాస్ ఇంటిలో ఒకే బెడ్‌పైన పడుకొనే వాళ్లం. అప్పుడు దీప్తి తన రెమ్యునరేషన్ గురించి వెల్లడించింది.

తనకు రోజకు ఒక లక్ష రూపాయలు చొప్పన పారితోషికం చెల్లిస్తున్నారని చెప్పింది. దీప్తి సునైనాకు ముందుగానే కొంత అడ్వాన్సు రూపంలో చెల్లించారు. ఆ మొత్తం నుంచి ఆమె బట్టలు, మేకప్ వస్తువులు కొనుక్కొన్నారు. నేను మాత్రం నా సొంత డబ్బులు ఖర్చు చేసి కొనుగోలు చేశాను అని సంజన తెలిపింది.