షాకింగ్.. మరో నటి ఆత్మహత్య.. టీనేజ్ కూతురిని చంపి తాను కూడా

535

సినీ, టీవీ కళాకారుల ఇంట్లో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలు కలచి వేస్తున్నాయి. ఆ మధ్య నటి ఝాన్సీ, యాంకర్ రాధికా, ఈ మధ్యనే నటుడు మధు ప్రకాష్ భార్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మరవక ముందే మరో నటి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. సీరియల్ నటి ప్రాడ్న్య, ఆమె కూతురు శుక్రవారం రోజు తమ ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్త ఉలిక్కిపాటుకు గురిచేసింది. మరి ఆమె కూతురితో సహా ఆత్మహత్య ఎందుకు చేసుకుందో పూర్తీగా తెలుసుకుందామా.

 ప్రశాంత్ పార్కర్ జిమ్ కి వెళ్లిన సమయంలో

ప్రాడ్న్య గత కొంత కాలంగా మరాఠ సీరియల్స్‌లో నటిస్తోంది. ఆమెకు టీనేజ్ కూతురు ఉంది. ఆమె భర్త ప్రశాంత్ పార్కర్ కొంతకాలంగా ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ బిజినేస్ చేస్తున్నారు. కొంత కాలంగా ఆయన బిజినెస్ సరిగా నడవక పోవడంతో ప్రాడ్న్య మరాఠ సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది. అయినప్పటికీ వారి ఆర్ధిక ఆర్థిక తీరక పోవడంతో తీవ్ర ఆవేదన చెంది తన కూతురితో సహా తల్లి ప్రాడ్న్య ఆత్మహత్య చేసుకుందని సమాచారం. శుక్రవారం రోజు ఉదయం ప్రాడ్న్య భర్త ప్రశాంత్ పార్కర్ జిమ్ కి వెళ్లిన సమయంలో కూతురు శృతితో కలిసి తల్లి ప్రాడ్న్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ప్రశాంత్ పార్కర్ జిమ్ కి వెళ్లి తిరిగి వచ్చి ఇంటి డోర్ బెల్ కొట్టగా.. ఎవరూ తీయకపోవడంతో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా లివింగ్ రూమ్‌లో తన కూతురు చనిపోయి ఉంది. బెడ్ రూమ్ లో తన భార్య ఫ్యాన్ కి దుప్పటితో ఉరి వేసుకొని చనిపోయి కనిపించింది అని తెలుస్తోంది.

ఈ క్రింద వీడియో చూడండి

విగత జీవులుగా పది ఉన్న ఇద్దరినీ ప్రశాంత్ పార్కర్ దగ్గరలో ఉన్న ప్రమీలా హాస్పిటల్ కి తరలించగా అప్పటికే వారు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. ఆ వెంటనే పోలీసులు భర్తని విచారించి ఆ ఇద్దరి చావులకు కారణం ఆర్ధిక సమస్యలేనని ప్రాథమిక అంచనాకు వచ్చారు. బాలీవుడ్ లో రాబోతున్న ‘సెక్షన్ 375’ అనే సినిమాలో కూడా ప్రాడ్న్య ఓ పాత్ర పోషించింది. తమ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులను తట్టుకోలేక, ఆ డిప్రెషన్ లోనే కూతురిని చంపేసి తను కూడా చనిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఇంటి వాళ్లు ప్రాడ్న్య తన కూతురిని ఎంతో ప్రేమగా చూసుకునేదని.. తన కూతురే ప్రపంచంగా బ్రతికేదని చెబుతున్నారు. మరి ఈ నటి కూతురితో సహా ఆత్మహత్య చేసుకోవడం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.