కాలేజీలో తన ప్రేమకథ గురించి చెప్పిన శిల్పాశెట్టి

233

బాలీవుడ్ లో పొడుగుకాళ్ల సుందరి అంటే అందరికి గుర్తుకువచ్చే పేరు శిల్పాశెట్టి.నటిగా ఎన్నో సినిమాలలో నటించిన ఆమె ఇప్పుడు బుల్లితెర మీద సందడి చేస్తుంది.అయితే ఈ మధ్య ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ, డేటింగ్‌, హార్ట్‌ బ్రేక్‌ గురించి కూడా పంచుకున్నారు.

Related image

‘ఓ అబ్బాయి ప్రతి రోజు సాయంత్రం మా ఇంటికి ఫోన్‌ చేసేవాడు. అప్పుడు నేను ఇంకా కళాశాల విద్యార్థినిని. ఆ వయసులో ఇలాంటి వాటికి ఏ అమ్మాయి ఆకర్షితురాలు కాదు చెప్పండి. అప్పుడు మనకు కేవలం ల్యాండ్‌లైన్‌ మాత్రమే ఉండేది. అతడి ఫోన్‌ కోసం ప్రతి రోజు సాయంత్రం ఎదురుచూసేదాన్ని. మా నాన్న ఇంటికి వస్తే.. ఫోన్‌ కట్‌ చేసేదాన్ని’.‘ఆ అబ్బాయి తన పేరు కూడా చెప్పలేదు. ఇవాళ బస్టాప్‌లో కలుద్దాం అని ఓ రోజు చెప్పా. కానీ అతడు రాలేదు. దీంతో అతడితో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నా.

Image result for shilpa shetty

ఆ తర్వాత తెలిసింది.. నా స్నేహితులతో ఆ అబ్బాయి పందెం కట్టాడని. అందుకే నాతో ప్రేమను నటించాడు. ఇదంతా ఓ సినిమా కథలా అనిపించింది, కానీ ఇది నిజం. ఆపై ఆ అబ్బాయి కూడా నాతో బంధాన్ని తెంచుకున్నాడు. పందెంలో గెలవడమే తన లక్ష్యం. నేను ఆవేదనకు గురి కాలేదని చెప్పను. గుండె పగిలి చాలా రోజులు బాధపడ్డా’ అని ఆమె పేర్కొన్నారు.