మరొక ప్రేమకథను మొదలు పెట్టిన శేఖర్ కమ్ముల..ముహూర్తం ఖరారు

249

తెలుగులో ఉన్న డిఫరెంట్ డైరెక్టర్స్ లలో శేఖర్ కమ్ముల ఒకరు.తనదైన పద్దతిలో సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.ఎక్కువగా ప్రేమకథలనే తీస్తుంటాడు.ఇప్పుడు మరొక ప్రేమకథను మొదలుపెట్టాడు.ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ క‌మ్ముల చేయ‌బోయే కొత్త సినిమా మొదలైంది.

Image result for shekar kammula

గ‌తంలో త‌న సినిమాల ద్వారా ఎంతో మంది హీరో, హీరోయిన్ల‌ను ప‌రిచ‌యం చేసిన శేఖ‌ర్ క‌మ్ముల త‌న త‌ర్వాతి సినిమాలో కూడా అంతా కొత్తవాళ్లనే నటింప జేయనున్నాడు. రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీగా తెర‌కెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టు, క్లాప్ బోర్డ్ పూజ కార్యక్రమాలు సోమవారం సికింద్రాబాద్ లోని గ‌ణేష్ ఆల‌యంలో జ‌రిగాయి. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబ‌ర్‌లో మొదలు కానుంది.

Shekhar Kammula started movie with love story

ఈ సినిమా ద్వారా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియ‌న్ గ్రూప్ నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. నటీనటులు,మిగతా సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పి రామ్మోహన్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, భరత్ నారంగ్, సదానంద్ పాల్గొన్నారు.