నేను పెళ్లి చేసుకుంటున్నా..మీరందరూ తప్పకుండా రావాలి..షారుక్ ఖాన్

422

ప్రియాంక చోప్రా పెళ్లి గురించి ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న కంటే 11 ఏళ్లు చిన్న‌వాడైన అమెరిక‌న్ సింగర్ నిక్ జొనాస్‌తో ప్రియాంక ప్రేమ‌లో ఉందని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరికి తెలిసిన విషయమే.అయితే పెళ్లి అనేది ఎప్పుడో ఇంకా తెలియదు.

కానీ ఇటీవ‌లె వీరి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌ని, సెప్టెంబ‌ర్ 15వ తేదీన పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ వార్త‌ల గురించి స్పందించేందుకు ప్రియాంక అందుబాటులో లేక‌పోవ‌డంతో ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు ప్రియాంక పెళ్లి గురించి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి.

తాజాగా ఓ అవార్డుల కార్య‌క్ర‌మానికి హాజ‌రైన షారూక్ వ‌ద్ద ఓ జ‌ర్నలిస్టు ప్రియాంక పెళ్లి గురించి ప్ర‌స్తావించాడు. దానికి షారూక్ స్పందిస్తూ `నిజమా.నాకు కూడా త్వ‌ర‌లో వివాహం జ‌రుగ‌బోతోంది. మీకు ఆహ్వానం పంపిస్తాను. త‌ప్ప‌కుండా నా పెళ్లికి రావాలి. మెహందీ ఫంక్ష‌న్‌కు కూడా హాజ‌రుకావాల‌`ని తన స్టైల్ లో స‌మాధానం ఇచ్చాడు.