షకీలా రియల్ లైఫ్ స్టోరీ

403

షకీలా..ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు.90 వ దశకంలో సినిమా ప్రపంచాన్ని ఊపేసిన పేరు ఆమెది.శృంగారాన్ని ఆయుధంగా చేసుకుని సినిమాలు చేసింది.ఆమె శృంగార సన్నివేశాల కోసమే సినిమాలకు వెళ్లిన యువత ఉన్నారంటే అతిశయోక్తి కాదు.షకీలా ఉందంటే చాలు సినిమా ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు వెళ్లేవారు.తెలుగు తమిళ్ కన్నడ మలయాళీ లాంటి లాంగ్వేజ్ లలో ఎన్నో చిత్రాలలో నటించింది.కొన్ని కోట్ల మందిని అభిమానులుగా మార్చుకుంది. సుమారు రెండు దశాబ్దాలపాటు వెండితెరపై సంచలనం రేపిన నటి షకీలా ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.ఈమె తెర జీవితమే మనకు తెలుసు. కానీ తెర వెనుక ఉన్న జీవితం మనలో చాలా మందికి తెలియదు.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for shakila

షకీలా ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రిది చెన్నై. తల్లిది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట దగ్గర కోట. తర్వాత ఆమె కుటుంబం చెన్నైలో స్థిరపడింది. దీంతో షకీలా చెన్నైలోనే పెరిగింది. చిన్నప్పుడు చదువులో వెనుకబడి ఉండేది కానీ యాక్టింగ్ లో మాత్రం ముందు ఉండేది. దీంతో ఆమె 10 వ తరగతిలో ఫెయిల్ అయ్యింది. దీంతో షకీలా చదువుకు బ్రేక్ చెప్పింది. “ప్లేగర్ల్స్” అనే ‘సాఫ్ట్‌కోర్’ చిత్రంతో ఈమె సినీ ప్రస్థానం మొదలెట్టింది ఈ సినిమాలో సిల్క్ స్మిత ప్రధాన కథానాయిక కావడం విశేషం. తర్వాత “కిన్నెర తుంబికళ్” అనే మళయాళం చిత్రంతో మొదటిసారిగా పాప్ లర్ అయింది. సుమారు 110 సినిమాల్లో నటించిన షకీలా, ఎక్కువగా తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

షకీలా నటించిన ఈ సినిమాలన్నీ దాదాపు “బి” గ్రేడ్ ‘సాఫ్ట్‌కోర్’ సినిమాలుగానే చెప్పుకోవచ్చు.ఈమె తారస్థాయిలో సినిమాలు తీసిన కాలంలో “షకీలా సినిమా” అన్న పదాన్ని “సాఫ్ట్ పోర్న్” సినిమాకు పర్యాయపదంగా వాడేవారు. ఇలాంటి షకీలా సినిమాల పాప్యులారిటీ విదేశీ భాషల్లోకి కూడా విస్తరించి, ఈ అర్ధనగ్న చిత్రాలు నేపాలీ, చైనీస్, సింహళ భాషల్లోకి కూడా డబ్బింగు చేయబడ్డాయి. తొలిరోజుల్లో సంచలనాత్మకంగా పైభాగంలో ఆఛ్ఛాదన లేకుండా కొన్ని కొన్ని సినిమాలలో నటించిది. కానీ ఆ తరువాత వచ్చిన సినిమాలలో అశ్లీల దృశ్యాల చిత్రీకరణకు మారు వేషధారిని ఉపయోగించింది. 2003 నుండి శృంగార పాత్రలు మానేసి సినిమాలలో క్యారక్టెరు ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ వచ్చింది.ఇలా తాను యవ్వనంగా ఉన్నన్ని రోజులు శృంగార పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను తెచ్చుకుంది.

Image result for shakila

తన పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎందుకు మారిందో తెలియజెప్పటానికి, షకీలాలు ఎలా పుడతారో, ఎలా రూపుదిద్దుకుంటారో అందరికీ తెలియాలని ఆత్మకథ రాసింది. అందులో ఎవరికీ తెలియని కొన్ని చీకటి కోణాలు ఉన్నాయి.ఆ విషయాల దగ్గరకు వస్తే.. ఆమె బాల్యంలో దుర్భర జీవితాన్ని గడిపింది. 16 ఏళ్ల వయసులో కన్నతల్లే వ్యభిచారం చెయ్యమని పంపించింది. తాను నటించిన చిత్రం కేవలం శృంగారాన్ని శృంగార భరితంగా చూపడానికి మాత్రమే పరిమితమయ్యాయని తనలోని నటనను బయటకు తీయడానికి ఎవరు ప్రయత్నించలేదని షకీలా తన ఆత్మకథలో చెప్పింది. తన ఆర్థిక వ్యవహారాలు చూసుకునే తన పెద్దక్క తనను మోసం చెయ్యడం ఎంతాగానమో తనను కృంగదీసిందని చెప్పుకొచ్చింది.ఇక సినిమాలతో విసిగిపోయి పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంటే కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. వాళ్ళు నన్ను డబ్బు కోసం మాత్రమే ఉపయోగించుకున్నారని, మన కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలంటే నువ్వు శృంగారాన్ని కంటిన్యూ చెయ్యాలని తన తల్లి చెప్పిందని చెప్పుకొచ్చింది. దాదాపు 20 మంది నన్ను ప్రేమించారు కానీ ఎవరు తనను పెళ్లి చేసుకోడానికి సాహసించలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఒక వ్యక్తి ఏడేళ్లు సహజీవనం చేశాడని కానీ చివరికి మోసం చేశాడని చెప్పింది. ఇలా జీవితంలో ఎన్నో భాదలు కష్టాలను అనుభవించి ఇప్పుడు తినడానికి కూడా లేక ఇబ్బందులు పడుతుంది. షకీలా సినిమాలలో నటించి జీవితంలో మళ్ళి స్థిరపడాలని కోరుకుందాం. మరి షకీలా గురించి ఆమె జీవితం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.