నాగచైతన్య సమంత మధ్య బిగ్‌ఫైట్.. కారణమేమిటో చూడండి..

343

దక్షిణాదిలో హాటెస్ట్ జంట అంటే సమంత, నాగచైతన్య జోడీయే గుర్తుకువస్తుంది.అయితే వీళ్లిద్దరు ఇప్పుడు పోట్లాడటానికి సిద్దపడుతున్నారు.అయితే అది రియల్ గా కాదులెండి రీల్ లైఫ్ లో.ఈ ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోరు మొదలైంది. సమంత నటించిన యూటర్న్, నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రాలు ఒకే రోజున విడుదల కానున్నాయి. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతున్నది.

Image result for shailaja reddy alludu

చైతూ, సమంత పెళ్లి తర్వాత వారిద్దరు నటించిన సినిమాలు ఒకే రోజున పోటాపోటిగా విడుదల కావడం చర్చనీయాంశమైంది. ఈ పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారో అనే విషయంపై ఆసక్తి పెరిగింది.మారుతి దర్శకత్వంలో నాగచైతన్య , అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన శైలజారెడ్డి అల్లుడు అలాగే కన్నడలో ఘన విజయం సాధించిన యూటర్న్ చిత్రాన్ని రీమేక్‌గా అదేపేరుతో తెలుగులో రూపొందిన యూటర్న్ సినిమా ఒకేరోజు విడుదల అవుతున్నాయి.

Image result for u turn telugu movie

యూటర్న్ చిత్రంలో సమంతతోపాటు రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా, ఆది పినిశెట్టి తదితరులు నటించారు.దీంతో భార్యాభర్తలు నటించిన ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి.మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.