కోడలా కోడలా కొడుకు పెళ్లామా సీరియల్‌లో నటిస్తున్న ఈమె ఎంత దారుణమైన పని చేసిందో తెలిస్తే షాక్..

3685

కొంతమంది సెలెబ్రిటీల జీవితం చెప్పుకునేంతలా ఏమి ఉండదు.తెరమీద మాత్రం హీరోల వేషాలు వేస్తారు బయటమాత్రం వాళ్ళు వేసే వేషాలు అన్నీఇన్నీ కావు.సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు నిజజీవితంలో చేసే కొన్ని పనులు వారి పరువుకు భంగం కలిగిస్తుంటాయి.నీతులు చెప్పాల్సిన వాళ్ళు నీతిమాలిన పని చేసి ఉన్న పరువును పోగొట్టుకుంటారు.ఇలా చేసిన మహానుభావులు చాలా మంది ఉన్నారు.ఇప్పుడు ఒక ప్రముఖ నటి కూడా అదే పని చేసింది..మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for దేవలీనా భట్టాచార్జీ

ముంబైలో ప్రముఖ వజ్రాల వ్యాపారి రాజేశ్వర్‌ కిశోరిలాల్‌ ఉదానీ హత్యకేసులో సుప్రసిద్ధ టెలివిజన్‌ సీరియల్‌ నటి దేవలీనా భట్టాచార్జీ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం నాడు క్రైం బ్రాంచ్‌ పోటీసులు బాంద్రా ప్రాంతంలోని ఆమె నివాసం నుంచి ఆమెను తీసుకెళ్లి ఇంటరాగేట్‌ చేస్తున్నారు. ‘‘ఉదానీ చివరిసారిగా ఆమె నివాసానికి వెళ్లినట్లు తేలింది. ఆమెతో ఆయనకు పరిచయాలున్నట్లు మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఆమెను అరెస్టు చేయలేదు. నిర్బంధంలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం’’ అని పోలీసు వర్గాలు తెలిపాయి. డాన్స్‌ ఇండియా డాన్స్‌ అనే షోతో టెలివిజన్‌కు పరిచయమైన ఈ బెంగాలీ నటి- సాథ్‌ నిభాయా సాథ్‌లో గోపీ బహూ పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

Image result for దేవలీనా భట్టాచార్జీ

ఇదే సీరియల్‌ తెలుగులో ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ పేరుతో డబ్‌ అయి ఆమె టైటిల్‌ రోల్‌తో ప్రేక్షకులను అలరించింది. తెలుగునాట కూడా అనేక కుటుంబాల్లో ఆమె పాప్యులర్‌ నటి. దేవలినా భరతనాట్యంలో మంచి ప్రావీణ్యమున్న నటి. టెలివిజన్‌ నటీమణుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటి కూడా ఆమే!గత నెల 28 నుంచీ కనబడకుండా పోయిన రాజేశ్వర్‌ కిశోరిలాల్‌ ఉదానీ- కుళ్లిన మృతదేహం పన్వేల్‌ ప్రాంతంలో లభించింది. ఆయన విఖ్రోలీ- అంధేరీ ప్రాంతాల మధ్య చివరిసారిగా సంచరించినట్లు కాల్‌ డేటా చెబుతోంది. ఆయనకు అనేకమంది మహిళలతో పరిచయాలున్నాయనీ, తరుచూ బార్లకు వెళుతుండేవాడనీ పోలీసులు చెప్పారు. ఆయన నుంచి కొన్ని విలువైన వజ్రాలు కూడా మాయమైనట్లు తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఈ హత్యకు ఆమెకు సంబంధం ఉన్నట్టు పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. పోలీసులకు చెప్పకుండా సిటీ దాటి వెళ్లోద్దని ఆమెకు పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఆమె స్నేహితుల మీద కూడా పోలీసులు విచారిస్తున్నారు.అవసరం అయినప్పుడల్లా పోలీస్ స్టేషన్ కు రావాలని పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.చూడాలి మరి ఈ హత్య కేసులో ఎలాంటి విషయాలు బయటపడతాయో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.దేవళినా గురించి అలాగే కిశోరీలాల్ హత్యకు ఈమెకు సంబంధం ఉందని అనుకుంటున్నారా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.