విజయ్ దేవరకొండ నోటాకు షాక్..సీన్స్ తొలగించాల్సిందే అని సెన్సార్ బోర్డు హెచ్చరిక

243

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ అక్టోబర్ 5న నోటా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.ఆనంద్ శంకర్ దర్శకుడు.జ్ఞానవేల్ రాజా నిర్మాత.విజయ్ నటించిన నోటా చిత్రం శుక్రవారం విడుదలవుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

Image result for nota movie release date

ఇదిలా ఉండగా విడుదలకు రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఈ చిత్రం సమస్యల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.నోటా చిత్రం రాజకీయ అంశాలతో రూపొందింది. నోటా చిత్రానికి సెన్సార్ నుంచి కూడా చిక్కులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కొన్ని వివాదభరిత సన్నివేశాలు, డైలాగులని సెన్సార్ సభ్యులు గుర్తించారని ప్రచారం జరుగుతోంది.

Related image

ఆ సన్నివేశాల్ని తొలగించి, డైలాగులని మ్యూట్ చేయాలని ఆదేశించారట.ఆ సన్నివేశాలు కాట్రవర్సీగా మారతాయని భావించిన సెన్సార్ సభ్యులు పలు కట్స్ సూచించినట్లు తెలుస్తోంది. సెన్సార్ ఆదేశాలకు అనుగుణంగా ఆయా సన్నివేశాలని తొలగించే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.