దాసరి ఇంటి ముందు పెద్ద కోడలు సుశీల వింత మాటలు వినండి.. షాకవుతారు

464

దర్శకరత్న, దివంగత దాసరి నారాయణ ఇంట్లో వివాదం రాజుకుంది. తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ ఆయన పెద్ద కోడలు సుశీల పోలీసులను ఆశ్రయించారు. మహిళా సంఘాలు, పోలీసులతో కలిసి ఆయ‌న ఇంటి ముందు నిరసనకు దిగారు. తనకు, తన కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాసరి చిన్న కుమారుడు అరుణ్, ఆయన భార్యపై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను డమ్మీగా చేసి ఆడిస్తున్నారంటూ సుశీల ఆవేదన వ్యక్తం చేశారు.

Image result for దాసరి సుశీల

ఏడాది కాలంగా తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మహిళా సంఘాలతో కలిసి దాసరి నివాసం ముందు సుశీల బైఠాయించి సంచ‌ల‌న కామెంట్లు చేశారు. దాసరి కుమారుడు తారక్ ప్రభుతో 1995లో తనకు రిజిస్ట్ర‌ర్ మ్యారేజ్ అయింది అని, స‌ర్టిఫికెట్ చూపించారు సుశీల‌. అప్పుడు దాస‌రి నారాయ‌ణ రావు మా పెళ్లిని అంగీక‌రించ‌లేద‌ని, త‌ర్వాత ఆ కుటుంబం మ‌మ్మ‌ల్ని కొద్ది రోజుల‌కు కలుపుకుంది అని తెలియ‌చేశారు.. త‌మ ఫ్యామిలీని త‌ర్వాత వేరేగా కాపురం పెట్టించార‌ని, త‌న భ‌ర్త త‌న‌తో ముందు బాగానే ఉండేవార‌ని తెలియ‌చేసింది. ఇక త‌ర్వాత దాస‌రి కుటుంబం త‌న భ‌ర్త‌కు అనేక విష‌యాలు నాపై చెప్పి, న‌న్ను వ‌దిలించుకోవాల‌ని చెప్పార‌ని, ఆయన్ని మార్చ‌డానికి ప్ర‌య‌త్నించారు అని తెలియ‌చేసింది.

Image result for దాసరి సుశీల

ఇక త‌న‌ని ఇంట్లోకి రానివ్వ‌కుండా దాస‌రి అరుణ్ అడ్డుకుంటున్నార‌ని, పోలీసుల సాయంతో తాను ఇంట్లో అడుగుపెడ‌తాను అని ఆమె తెలియ‌చేశారు. త‌న కుమారుడ్ని సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తాను అని ఆ నాడు దాసరినారాయ‌ణ రావు మాట ఇచ్చార‌ని, కాని అది నెర‌వేర్చ‌లేదు అని ఆమె తెలియ‌చేశారు. ఇక త‌న‌ను విడాకులు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నార‌ని, తాను విడాకులు ఎట్టిప‌రిస్దితుల్లో ఇవ్వ‌ను అని ఆమె తెలియ‌చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

త‌మ‌కు వారి ఆస్తిలో వాటా ఇవ్వాలి అంటూ హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.46లోని దాసరి నివాసం వద్ద బైఠాయించారు. ఈ విష‌యంలో ఆమెకు పలు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. దాసరి నారాయణరావు ఉన్నంతకాలం తమ కుటుంబానికి అండగా నిలిచారని, ఆయన చ‌నిపోయిన త‌ర్వాత కొడుకు తమను విస్మరించడంతోపాటు.. కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించక‌పోవడంతో.. రోడ్డున పడ్డామని చెప్పారు. ఇప్పటికీ చట్టపరంగా దాసరి ప్రభుతో విడాకులు ఇవ్వలేదని, మామ ఆస్తిపై హక్కు ఉందన్నారు. న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి వెళ్లనని చెప్పారు సుశీల.. మ‌రి ఈ కుటుంబ వివాదం ఎలా పరిష్కరించాలా అని సినీ ఇండ‌స్ట్రీలో పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.