వామ్మో శేఖర్ మాస్టర్ కూతురును చూస్తే హీరోయిన్స్ కూడా పనికిరారని అంటారు..

861

డీ షో డాన్స్ కు ఎంత ఫెమాసో అందరికి తెలుసు. డాన్స్ టాలెంట్ ఉన్న వారిని పరిచయం చేసే ఒక వేదిక డీ. ఒక్క డాన్స్ మాత్రమే కాదు రష్మీ సుదీర్ ప్రదీప్ చేసే కామెడీ డీ షోకు హైలెట్ అని చెప్పుకోవచ్చు.ఈ షోకు జడ్జీలుగా ప్రియమణి ఆనీ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఉంటాడు.శేఖర్ మాస్టర్ ఎంత బిజీ కొరియోగ్రాఫరో మన అందరికి తెలుసు. డీ షోతో శేఖర్ మాస్టర్ ప్రయాణం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. అందుకే ఎన్ని షూటింగ్స్ ఉన్నా కూడా డీ షోకు తప్పకుండ వస్తాడు. డీ షోకు పర్మినెంట్ మాస్టర్ గా సెటిల్ అయిపోయాడు శేఖర్ మాస్టర్.

Image result for sekhar master daughter

అలాగే స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాడు. అల్లుఅర్జున్ ఎన్టీఆర్ చిరంజీవి రామ్ చరణ్ రామ్ లాంటి హీరోలకు రెగ్యులర్ కొరియోగ్రాఫర్ ఈయన. వాళ్ళ సినిమాలలో ఒక్క పాట అయినా శేఖర్ మాస్టర్ ది ఉండాల్సిందే. ఆయనకు డేట్స్ లేవంటే కూడా షూటింగ్ ఆపేస్తారు.అంతలా పేరు తెచ్చుకున్నాడు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ 1 కొరియోగ్రాఫర్ ఎవరంటే శేఖర్ మాస్టర్ అనే చెప్పుకోవాలి. ఇక ఆయన ఫామిలీ విషయానికి వస్తే అప్పుడప్పుడు శేఖర్ మాస్టర్ కొడుకు కూడా డీ లో మెరుస్తుంటాడు. శేఖర్ మాస్టర్ కొడుకు విన్నీ ఇప్పటికే చాలా ఫెమస్ అయిపోయాడు.అలాగే జబర్దస్త్ లో కొన్ని స్కిట్స్ చెయ్యడం అలాగే ఎవడి గోల వాడిది షోలో కూడా తండ్రి కొడుకులు స్కిట్ చెయ్యడం వలన శేఖర్ మాస్టర్ కొడుకు గురించి జనాలకు తెలుసు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మరి శేఖర్ మాస్టర్ కూతురి పరిస్థితి ఏమిటి. ఎప్పుడో చాలా రోజుల క్రితం ఒక పోగ్రామ్ లో వచ్చింది.అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూతురు చాలా మారిపోయింది. ఎంతలా అంటే ఆమె శేఖర్ మాస్టర్ కూతురు అంటే ఎవరు నమ్మరు. టిక్ టాక్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంది శేఖర్ మాస్టర్ కూతురు.తండ్రితో కలిసి డాన్స్ చేసి వాటిని పోస్ట్ చేస్తుంది.ఎంతైనా డాన్స్ మాస్టర్ కూతురు కదా. స్టేజ్ మీదకు రాకపోయినా ఇంట్లోనే తన డాన్స్ లతో అలరిస్తుంది.టిక్ టాక్ వీడియోలతో ట్రేండింగ్ గా మారుతుంది శేఖర్ మాస్టర్ కూతురు.ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు టిక్ టాక్ వీడియోల ద్వారా తనలో ఉన్న నటనను డాన్స్ ను అందరికి చూపిస్తుంది.వీటిని చుసిన వాళ్ళు కొరియోగ్రాఫర్ గా కాకున్నా ఒక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో అని అనుకుంటున్నారు.ఆమె యాక్టింగ్ ఫీల్డ్ లోకి వస్తే బాగుంటుందని చాలా మంది సలహా ఇస్తున్నారు.చూడాలి మరి శేఖర్ మాస్టర్ తన ఇద్దరు పిల్లలను ఏ రంగంలోకి తీసుకొస్తాడో. మరి శేఖర్ మాస్టర్ గురించి అలాగే అయన కూతురి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పం