కూతురుచేసిన ప‌నికి క‌న్నీళ్లు పెట్టుకున్న మీనా ఏం చేసిందో చూడండి

475

సీతారామయ్య గారి మనవరాలు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా బాలనటిగా చాలా సినిమాలు చేసింది. 1975సెప్టెంబర్ 16న చెన్నైలో జన్మించిన మీనా దక్షిణాది భాషలన్నిటిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సినిమాలు ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ అనే చెప్పాలి. సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో మంచి పాత్ర‌లు చేసింది మీనా… ఆమె తండ్రి దురైరాజు టీచర్ గా పనిచేసారు. ఇక ఆమె తల్లి రాజమల్లిక ఒకనాటి తమిళ నాట హీరోయిన్. అలాగే మలయాళం లో కూడా నటిగా రాణించింది. సినీ అనుభవం గల రాజమల్లిక తనకూతురు మీనాను హీరోయిన్ గా చేయడానికి ఎంతో కష్టపడింది. జెమిని గణేష్ ఓ పార్టీలో మీనాను చూసి,బోలెడు భవిష్యత్తు ఉందని అఫర్ ఇచ్చారట. ఇక రాజమల్లిక మరో అడుగువేసి,నిర్మాత ఏఎం రత్నం దగ్గరకు తీసుకెళ్లగా ఆయన కూడా ఛాన్స్ ఇచ్చాడు.

Image result for meena

మొత్తం మీద మీనా బాలనటిగా సిరివెన్నెల,రెండు రెళ్ళు ఆరు మూవీలతో మంచి పేరు సంపాదించుకుంది. ఇక హీరోయిన్ గా అవతారం ఎత్తాక తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో హీరోయిన్ గా రాణించింది. తెలుగులో చంటి,సుందరకాండ,ప్రెసిడెంట్ గారి పెళ్ళాం,అల్లరి మొగుడు చిత్రాలతో టాప్ హీరోయిన్ అయింది. సినిమా ఛాన్స్ ల కారణంగా 8వ తరగతి నుంచే స్కూల్ నుంచి దూరమైన మీనా ప్రేవైట్ గా ఎం ఏ పూర్తిచేసింది. మీనా అన్ని భాషా చిత్రాల్లో నటించడమే కాదు, ఆ భాషలను కూడా సులువుగా మాట్లాడుతుంది. చిన్న‌త‌నం నుంచే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మీనా ప‌లుభాష‌ల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపుని తెచ్చుకుంది.

Image result for meena

1991నుంచి 2000సంవత్సరం వరకూ తెలుగు, తమిళ చిత్ర రంగాల్లో అగ్ర నాయికగా నిల్చింది. ఇక ఓసారి మీనా షూటింగ్ కోసం కాకినాడ సమీపంలోని ఓ మారుమూల గ్రామానికి వచ్చింది. అది బాలయ్య నటించే బొబ్బిలి సింహం మూవీ. అందులో మీనా హీరోయిన్. అయితే మీనా మేకప్ మాన్ అక్కడికి రాలేకపోతే,మీనాకు ఆమె తల్లి రాజమల్లిక మేకప్ వేసింది. త‌ర్వాత కొద్ది రోజుల‌కు సినిమా ఛాన్స్ లు తగ్గాయని తెల్సి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని 2009లో మీనా పెళ్లిచేసుకుంది.

ఈ క్రింది వీడియో చూడండి

వీరికి పుట్టిన పాపకు నైనికా అనే పేరు పెట్టుకున్నారు. పెళ్లయ్యాక కూడా కేరక్టర్ ఆర్టిస్టుగా మంచి రోల్స్ పోషిస్తోంది. ఇక మీనా కూతురు నైనికా తమిళంలో విజయ్ సినిమాలో బాలనటిగా నటించింది. ఆతర్వాత సిద్ధికీ డైరెక్షన్ చేసిన భాస్కర్ ఓరు రాస్కెల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక అసలు విషయం ఏమిటంటే విజయ్,సిద్ధిఖీలతో కల్సి నటించాలని మీనా అనుకునేదట. కానీ వారితో తన కూతురు నటించినందుకు మీనా తెగ సంతోషపడుతోంది. ఇక మీనా కూతురు నైనికాని పెద్ద హీరోయిన్ చేయాలి అని మీనా ఆశ‌ప‌డుతోంది ..పైగా త‌న‌లా చిన్న‌త‌నంలో త‌న కూతురు కూడా సినీ అరంగేట్రంచేసింది అని, అందుకే సంతోషంగా ఉన్నాను అని త‌న స‌న్నిహితుల‌తో చెప్పింద‌ట‌. మ‌రి మీనా కోరిక తీర‌డంతో ఆనందంలో ఉంది, మీనా కూతురు సినిమాలో న‌ట‌న ఎలా చేసిందో చూశారుగా, మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.