లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చూసి బాలయ్య RGVకి ఎలా వార్నింగ్ ఇచ్చాడో చూస్తే షాక్

468

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో బయోగ్రాఫికల్‌ మూవీ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించాడు. ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసిన వెన్నుపోటు అంశంపై సినిమాలో చర్చించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమా విడుదలను అడ్డుకునేందుకు శతవిదాల ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రిలీజ్‌పై స్టే విధించటంతో ఇతర ప్రాంతాల్లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఒక్క ఏపీలో తప్పా అన్ని చోట్ల ఈ సినిమాను రిలీజ్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది అని టాక్ వచ్చింది. వర్మ సినిమాను తెరకెక్కించిన విధానం అందరికి బాగా నచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర పోషించిన విజయ్ కుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక లక్ష్మి పార్వతి పాత్ర పోషించిన యజ్ఞశేట్టి కూడా మంచి నటనను కనపరిచాడు. ఇక చంద్రబాబు పాత్ర పోషించిన శ్రీతేజ్ కూడా మంచిగానే నటించాడు. కుళ్ళు కుతంత్రాలను వర్మ చాలా చక్కగా చూపించాడు. వైస్రాయ్ హోటల్ ఘటనను పార్టీని చంద్రబాబు లాక్కున్న విధానాన్ని లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ను ఎందుకు పక్కన పెట్టారు లాంటి విషయాలను బాగా చూపించారు ఆర్జీవీ. అయితే ఈ సినిమా మీద సామాన్య ప్రేక్షకులకే కాదు సినీ సెలెబ్రెటీలకు కూడా ఆసక్తి ఉంది. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు ఈ సినిమా చూశారు.

Image result for balakrishna

అందులో మన నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నాడు. బాలయ్య ఈ సినిమాను చూసి మీడియాతో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్మ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించాడు ఎలాంటి అంశాలను తీసుకున్నాడో చూద్దాం అని వచ్చాను. సినిమా మొత్తం కల్పితమే ఉంది. నాన్నగారిని మేము మా కుటుంబం మొత్తం మానసిక క్షోభ అనుభవించేలా చేశామని వర్మ అనుకుని ఈ సినిమా తీశాడు. ఇందులో వాస్తవం లేదు. అసలు జరిగిన కథను కాకుండా కేవలం తన ఊహకు అందిన కథను వర్మ తీశాడు. ఇందులో మా కుటుంబం పరువు పోయేలా చాలా సీన్స్ ఉన్నాయి. వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం. టీడీపీ పార్టీని కాపాడుకోడానికి అప్పుడు నాన్నగారిని ఎదిరించాం కానీ ఆయనను దూరం చేసుకోవాలని కాదు. పార్టీ వేరే వాళ్ళ చేతుల్లోకి పోతుందని అలా చేశాం కానీ వర్మ చూపించినట్టు అసలు జరిగింది అది కాదని బాలయ్య చెప్పాడు.మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.