సవ్యసాచి సుభద్ర పరిణయం ట్రైలర్ సూపర్..నవ్వులే నవ్వులు..

295

చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రి మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం రేపు(శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.ఇప్పటివరకు సవ్యసాచి చిత్రానికి సంబంధించి యాక్షన్, థ్రిల్లింగ్, లవ్, సెంటిమెంట్‌లను మాత్రమే టీజర్ ట్రైలర్‌ల ద్వారా చూపించారు. తాజాగా ఈ చిత్రంలోని ‘సుభద్రా పరిణయం’ నాటకానికి సంబంధించిన సన్నివేశాన్ని రిలీజ్ చేసింది.

Related image

విడుదల చేసిన ట్రైలర్ మొత్తం కామెడీగా ఉంది. ఈ చిత్రంలో కావాల్సినంత కామెడీ కూడా ఉందని చెప్పే ప్రయత్నాన్ని ఈ ట్రైలర్ ద్వారా చెప్పేశారు..కాలేజ్‌లో చైతూ ఆయన ఫ్రెండ్స్ కలిసి ‘సుభద్ర పరిణయం’ నాటకం వేస్తారు. ఆ నాటకంపైనే ఈ ట్రైలర్‌ను కట్ చేసి రక్తి కట్టించారు. ఇందులో కృష్ణుడిగా వెన్నెల కిషోర్, అర్జునుడిగా చైతూ, బలరాముడిగా హైపర్ ఆది, చెలి కత్తెగా విద్యు రామన్ కనిపిస్తున్నారు.

‘మన కాలేజ్‌లో సుభద్రా పరిణయం అనే నాటకం జరగబోతోంది’ అంటూ విద్యు రామన్ చెప్పే సీన్‌తో నాటకం ప్రారంభమవుతుంది. ‘కృష్ణా.. బలరాముడంటే రాముడికి చుట్టమా?’ అని ధర్మరాజు పాత్రధారి అడగటం.. ‘సుదర్శన చక్రం సర్వీసింగ్‌కి ఇచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే నీకుండేదిరా దరిద్రుడా’ అంటూ కృష్ణుడి పాత్రధారి వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్స్ బాగా నవ్వించాయి. ఇందులో మొత్తం మూడు రౌండ్లు ఉంటాయని హైపర్ ఆది చెప్పగా.. ‘బలరామ్ బావా నాకు రెండు రౌండ్లకే కళ్లు తిరుగుతాయి’ అని చైతు చెప్తాడు.దీంతో సినిమాలో కామెడీ కేసుల ఉందని అందరికి అర్థం అయ్యింది.