ఆ క‌థ‌నాదే ద‌ర్శ‌కుడు శంక‌ర్

370

2010లో దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన యందిరన్ రోబో ఎంత‌టి స‌క్సెస్ ఇచ్చిందో తెలిసిందే .. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది.. ఈ సినిమా ప‌రంగా శంక‌ర్ మార్క్ అంటే ఇదే అని చెబుతారు… ఇక విమ‌ర్శ‌లు చేసే క్రిటిక్స్ కూడా ఈ సినిమాలో లోపాలులేవు అని క‌థ ప‌రంగా యాక్షన్ సన్నివేశాల్లో న‌ట‌న ప‌రంగా అద్బుతం అని ప్ర‌సంస‌లు కూడా ఇచ్చారు.

Image result for roboo

అయితే ఇప్పుడు సినిమాలు అంటే న‌వ‌ల క‌థా ర‌చ‌యిత‌ల నుంచి కాపీ కొట్ట‌డం చేస్తున్నారు.. ఇలా చేయ‌డం త‌ర్వాత‌ కేసులు వేయ‌డంతో ఇవి మ‌రింత వివాదాల‌కు కార‌ణం అవుతున్నాయి.. తాజాగా శంక‌ర్ పై కూడా ఇలాంటి అభియోగం వ‌చ్చింది..ఆరూర్‌ తమిళనాథన్‌ అనే రచయిత యందిరన్ కథ తనదని కేసు వేశారు. దీంతో శంక‌ర్ కోర్టుకు హాజ‌రు అవ్వాల్సి వ‌చ్చింది.

Image result for robo movie

ఇక ఈ క‌థ త‌న‌దే అని శంక‌ర్ తెలియ‌చేశారు.. ఆయ‌న చెప్పే క‌థ‌కు ఈ క‌థ‌కు సంబంధం లేదు అని ఆయ‌న కోర్టులో త‌న వివ‌ర‌ణ ఇచ్చారు. రెండింటిలో వ్య‌త్యాసాలు ఉన్నాయి అని కావాలంటే ప‌రీక్షించుకోవాలి అని అన్నాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్ .. మ‌రి దీనిపై కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి.