సంకల్ప్ రెడ్డి మరో ప్రయోగ..ఈసారి అంటార్కిటికా మీద పడ్డాడు..

184

ఘాజి చిత్రంతో ఇండియన్ సినిమా దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. ఘాజి చిత్ర తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలై విజయాన్ని అందుకుంది.ఆ తర్వాత కొంచెం రిస్క్ అయినా కూడా అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో వరుణ్ తేజ్ తో అంతరిక్షం చిత్రాన్ని తెరకెక్కించాడు.. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది.

Related image

అయినా కూడా సంకల్ప్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు.మొదటి రెండు సినెమాలలాగే విభిన్నమైన, యూనివర్సల్ కథలతోనే సినిమాలు రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సంకల్ప్ రెడ్డి తదుపరి చిత్రం మంచు ఖండం అంటార్కిటికా నేపథ్యంలో ఉండబోతోందట.

Image result for sankalp reddy

ఈ చిత్రంలో హీరో అంటార్కిటికా రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ కావడం, అక్కడ అతడు ఎదుర్కొనే సవాళ్లతో సంకల్ప్ రెడ్డి ఉత్కంఠ భరితమైన కథని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.