నాకు పుట్టబోయే బిడ్డ డాక్టర్ కావాలనుకుంటున్నాను..సానియా మీర్జా

394

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గర్భంతో వున్న సంగతి తెలిసిందే. అయితే తనకు పుట్టబోయే బిడ్డను స్పోర్ట్స్‌ స్టార్‌గా చూడాలనుకోవడం లేదని చెప్పింది.. భవిష్యత్తులో మీ బిడ్డను భారత్ లేదా పాకిస్థాన్ ఏ దేశం తరపున ఆడిస్తారు? అంటూ ఇంటర్వ్యూలోలో అడిగిన ప్రశ్నకు సానియా ఇలా సమాధానం ఇచ్చింది.

Image result for sania mirza pregnant

భవిష్యత్తులో తన బిడ్డను ఏ క్రీడలోనూ చూడాలనుకోవట్లేదని.. తన బిడ్డను గొప్ప డాక్టర్‌గా చూడాలనుకుంటున్నట్లు తెలిపింది. తన బిడ్డ జాతీయత గురించి ఆలోచించడం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అదే సమస్య తలెత్తితే భారత్, పాక్ కాకుండా మూడో దేశాన్ని ఎంచుకుంటానని పేర్కొంది. తమకు ఎవరు పుట్టినా ఓకే అని, అయితే షోయబ్ మాత్రం అమ్మాయినే కోరుకుంటున్నాడని సానియా మీర్జా చెప్పుకొచ్చింది.

Image result for sania mirza pregnant

ప్రస్తుతం సానియాకు ఏడో నెల కొనసాగుతోంది.మొత్తం దేశం తనను బాబీ అని పిలుస్తుంది. పాకిస్థానీయులు తనకు ఎంతో గౌరవం ఇచ్చారు. పాకిస్థాన్ క్రికెటర్ అయిన షోయబ్‌ పట్ల గల గౌరవాన్ని.. ఆ దేశ ప్రజలు తనపై చూపుతున్నారని, అదే తరహాలో షోయబ్ ఇక్కడకు వచ్చినప్పుడు తన దేశ ప్రజలు కూడా ప్రేమ, గౌరవాన్ని పొందుతాడని సానియా క్లారిటీ ఇచ్చింది.