అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ ?

212

‘అర్జున్‌రెడ్డి’తో సినీ ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రం ఇటు సందీప్, అటు విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు సందీప్ టేకింగ్‌కు ఫిదా అయిపోయి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌ ‘కబీర్ సింగ్’లో అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

Jr Ntr Next Movie With Sandeep Reddy Vanga - Sakshi

అయితే ఈ చిత్రం తర్వాత ఏ సినిమా తీస్తాడా అని అందరు ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజులుగా మహేష్ బాబు హీరోగా సందీప్‌ సినిమా ఉంటుదన్న టాక్‌ గట్టిగా వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం సందీప్.. ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్‌కు కథ కూడా వినిపించాడన్న ప్రచారం జరుగుతోంది.

arjun reddy director to work with jr ntr ?

ప్రస్తుతం ఎన్టీఆర్‌.. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌ (వర్కింగ్‌ టైటిల్‌)లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత సందీప్‌ సినిమా ఉండే చాన్స్‌ ఉంది.అయితే దీని మీద అధికారిక ప్రకటన రావాలి.