ఘోర విషాదం! తమ్ముడి మృతితో కుప్పకూలిన సందీప్ కిషన్… అసలేం జరిగిందో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

551

హీరోలకు, అభిమానులకు మధ్య ఉండే అనుబంధమే వేరు.అభిమానానికి ఎల్ల‌లు ఉండ‌వు. ముఖ్యంగా తెలుగు హీరోలు వారి అభిమానులపై చూపే ప్రేమకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతుంటారు. వారి కోసమే ప్రత్యేకించి సినిమాలను చేస్తూ ఉంటారు హీరోలు. అభిమానులే దేవుళ్లు అంటూ సినిమా ఫంక్షన్లలో హీరోలు వారి గురించి చెబుతూ ఉంటారు. అభిమానులు లేకపోతే హీరోలు అనేవారు ఉండరు. అందుక‌నే హీరోలు అభిమానుల ప‌ట్ల ఆద‌ర‌ణ‌ను చూపుతూనే ఉంటారు. వారి కోసం ఏమైనా చేద్దామని అనుకుంటారు. చాలా మంది హీరోలు చేశారు కూడా. అయితే అలా ఎంతో ఇష్టపడే అభిమాని చనిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. చాలా బాధగా ఉంటుంది కదా. అలంటి పరిస్థితే యువ క‌థానాయ‌కుడు సందీప్‌కిష‌న్ కు వచ్చింది. ఆయన వీరాభిమాని ఒకరు చనిపోయారు..

Image result for sundeep kishan sad

సందీప్‌కిష‌న్ తొలి చిత్రం `ప్ర‌స్థానం` నుండి అభిమాని అయిన క‌డ‌ప శ్రీను ఈరోజు ప్రొద్దుటూరులో గుండెపోటుతో క‌న్నుమూశారు. కడప శ్రీను మృతితో ఆయన కుటుంబం అతని అండ కోల్పోయింది. శ్రీను ఆర్థిక పరిస్థితి అంతంతగా ఉండటంతో కుటుంబానికి అండగా నిలువాలని సందీప్ కిషన్ నిర్ణయం తీసుకొన్నాడు. వెంటనే కడప శ్రీను ద‌హ‌న సంస్కారాల‌కైయ్యే డ‌బ్బును వెంటనే అందజేసే ఏర్పాట్లు చేశాడు. ఆయన తల్లికి నెలకు రూ.7 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తానని మాట ఇచ్చాడు. నాకు అన్ని సంద‌ర్భాల్లో అండ‌గా నిల‌బడ్డ నా అభిమాని కడప శ్రీను. నా సినీ కెరీర్‌లో తొలి అభిమాని, నిజాయితీతో కూడిన ఫ్యాన్‌ను కోల్పోవ‌డం బాధాక‌రం. చిన్న వ‌య‌సులోనే నా సోద‌రుడు లాంటి వ్యక్తి దూరం కావ‌డం బాధాక‌రం. నీ కుటుంబానికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను శ్రీను అని సందీప్ కిషన్ ట్విట్టర్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి 

అంతేకాకుండా ఇక నుంచి నీ కుటుంబ బాధ్య‌త నాది. ల‌వ్ యు శ్రీను.. నీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి“ అంటూ హీరో సందీప్ కిష‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా సంతాపాన్ని ప్ర‌క‌టించారు. అభిమాని మృతికి సందీప్ కిషన్ స్పందించిన తీరుపై హర్షం వ్యక్తమవుతున్నది. సందీప్ కిషన్ అంటే కడప శ్రీనుకు చెప్పలేనంత అభిమానం. ప్రతీ సినిమా విజయవంతం కావాలని ఆక్షాంక్షించేవాడు. ఆంధ్రప్రదేశ్ సందీప్ కిషన్ ఫ్యాన్స్‌కు అధ్యక్షుడిగా పనిచేశాడు. అలాగే సందీప్ కిషన్ కోసం ప్రొద్దుటూరులో అనేక కార్యక్రమాలు నిర్వహించినట్టు కడప శ్రీను సన్నిహితులు వెల్లడించారు. అలాంటి అభిమాని దూరం కావడం కావడంపై సహచరులు దిగ్బ్రాంతికి లోనైనట్టు తెలిసింది.కడప శ్రీను ఆత్మ ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం.