#RRR లో ప్రముఖ పాత్రలో నటిస్తున్న టాప్ డైరెక్టర్

264

దర్శకదీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా #RRR. ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో అటు మెగా ఇటు నందమూరి అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ఈ చిత్రం స్వాతంత్ర సమర నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Image result for #RRR

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర రెండవ షెడ్యూల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే చిత్రం గురించి ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. రాంచరణ్, ఎన్టీఆర్ మినహా ఈ చిత్రంలో నటించే మిగిలిన నటుల వివరాలని రాజమౌళి ఇంకా ప్రకటించలేదు.

Image result for samuthirakani

అయితే తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించబోతున్నాడు..రఘువరన్ బిటెక్ చిత్రంలో సముద్రఖని ధనుష్ తండ్రి పాత్రలో నటించారు.ఎన్టీఆర్, చరణ్ తర్వాత నటుడిగా సముద్రఖని పేరు వినిపిస్తోందంటే ఈ చిత్రంలో ఆయన పోషించే పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.