చైతు ఎప్పుడంటే అప్పుడే పిల్లలు..సమంత

366

దక్షిణాదిలో హాటెస్ట్ జంట అంటే సమంత, నాగచైతన్య జోడీయే గుర్తుకువస్తుంది.స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే కెరీర్ ఏమవుతుందో అనే భయం కూడా లేకుండా నాగచైతన్యను పెళ్లి చేసుకుంది.నాగ‌చైత‌న్య‌ను వివాహం చేసుకుని అక్కినేని ఇంటి కోడ‌లు అయిన త‌ర్వాత కూడా హీరోయిన్‌గా త‌న జోరు కొనసాగిస్తోంది స‌మంత‌.

Image result for samantha u turn

ఈ ఏడాది స‌మంత న‌టించిన `రంగ‌స్థ‌లం`, `మ‌హాన‌టి`, `అభిమ‌న్యుడు` సినిమాలు ఘ‌న‌విజ‌యాలు సాధించాయి.తాజాగా ఆమె న‌టించిన `యూట‌ర్న్‌` సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.ముఖ్యంగా పిల్ల‌ల గురించి స‌మంత మాట్లాడింది.

Image result for samantha naga chaitanya photos

`పిల్ల‌ల గురించి ఇంకా ప్లాన్ చేసుకోలేదు. నాకైతే పిల్ల‌లు కావాల‌నే ఉంది. అయితే ఈ విష‌యంలో చైతూ నిర్ణ‌య‌మే కీలకం. చైతూ ఎప్పుడంటే అప్పుడు పిల్ల‌ల గురించి ప్లాన్ చేస్తాం. పిల్ల‌ల విష‌యంలో చైతూను ఇబ్బంది పెట్ట‌ను. ఈ వినాయ‌క చ‌వితికి విడుద‌ల కాబోతున్న మా ఇద్దరి సినిమాలూ ఘ‌న‌విజ‌యాలుగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాన‌`ని స‌మంత చెప్పింది.