కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సమంతా..60 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో ఎలా ఉంటుందో..

312

సమంత ఈ ఏడాది చాలా బిజీగా ఉంది.వరుస సినిమాలను మన ముందుకు తీసుకొస్తుంది.ఈ ఏడాది రంగస్థలం అభిమన్యుడు మహానటి యు టర్న్ సినిమాలను మన ముందుకు తీసుకొచ్చింది.ప్రస్తుతం భర్త అక్కినేని నాగచైతన్యతో కలిసి మజిలీ చేస్తుంది.ఈ చిత్రంలో రియల్ లైఫ్ కపుల్స్ రీల్ లైఫ్ కపుల్స్ గా నటిస్తున్నారు. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు.

Related image

ఇలా వరుసగా విచిత్రమైన సినిమాలలో నటిస్తుంది. తాజాగా సమంత మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రారంభించింది.నందిని రెడ్డి దర్శత్వంలో సమంత నటించేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ నేడు ప్రారంభమైంది.

Image result for samantha nandini reddy movie launch

ఈ చిత్రంలో సమంత వృద్ధురాలి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఛాలెంజింగ్ రోల్ లో నటించనుండడం చాలా ఆసక్తి కలిగిస్తోందని సమంత తెలిపింది. ఇలాంటి పాత్రల్లో నటించాలంటే చాలా ధైరం ఉండాలని కూడా పేర్కొంది. మొత్తంగా సమంత వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది.