అమృతకు న్యాయం చెయ్యడం కోసం అక్కినేని సమంతా సంచలన నిర్ణయం.. షాకైన స్టార్ హీరోలు

475

సినిమాల‌ను చూసి నిజ‌జీవితంలో మ‌ర్డ‌ర్ల‌కు ప్లాన్ వేస్తున్నారు రౌడీలు.. తాజాగా అలాగే జ‌రిగింది అని చెప్పాలి ప్ర‌ణ‌య్ హ‌త్య‌, గ‌తంలో కూడా ఇలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చిన రౌడీలు ఉన్నారు.. అంతిమ తీర్పు సినిమాను తీసుకుని ప‌రిటాల ర‌విని చంపాను అని మొద్దు శ్రీను గ‌తంలో చెప్పారు ఇలా సినీ ఫ‌క్కిలో అనేక హ‌త్య‌లు చేశారు, ఇప్పుడు మారుతిరావుకూడా ఓ సినిమా త‌ర‌హా మ‌ర్డ‌ర్ ప్లాన్ వేశాడు. అస‌లు విష‌యానికి వ‌స్తే.

Image result for pranay and amrutha

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసులో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ కేసు దర్యాప్తు వివరాలను తెలియజేశారు. కులాలు వేర్వేరు కావడంతోనే మారుతీరావు ప్రణయ్‌ను హత్యచేయించినట్లు తెలిపారు. ‘ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. హత్య చేసిన వ్యక్తి బిహార్‌కు చెందిన సుభాష్‌ శర్మ. అతన్ని సమస్తిపూర్‌ కోర్టులో హాజరుపరిచాం అని ఎస్పీ తెలియ‌చేశారు. అమృత తండ్రి మారుతీరావు రూ. కోటి రూపాయల ఒప్పందంతో హత్య చేయించాన‌ని ఒప్పుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ కేసులో ఏ1 మారుతీరావు, ఏ2 సుభాష్‌ శర్మ, ఏ3 అస్గర్‌ అలీ, ఏ4 మహ్మద్‌ బారీ, ఏ5 అబ్దుల్‌ కరీం, ఏ6 మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ ఏ7 మారుతీ రావు డ్రైవర్‌ శివకుమార్‌లని తెలియ‌చేశారు.

Image result for samanth

అస్గర్‌ అలీ, మహ్మద్‌ బారీలపై గతంలోనే కేసులున్నాయి. మహ్మద్‌ బారీ ప్రస్తుతం హైదరాబాద్‌ మలక్‌ పేటలో నివసిస్తున్నాడు. 2012 నుంచి మారుతీరావుకు బారీతో పరిచయం ఉంది. రాజమండ్రి జైలులో మహ్మద్‌బారీ, సుభాష్‌శర్మలకు పరిచయం ఏర్పడింది. ప్రణయ్‌ హత్యా ఒప్పందానికి కరీం సహకరించాడు. జనవరిలో ప్రణయ్‌, అమృతలు పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ వల్ల వారి చదువులను మధ్యలోనే ఆపేశారు. మారుతీరావు కొన్నిసార్లు ప్రణయ్‌ను బెదిరించాడని . వీరిని చంపేందుకు ఇప్ప‌టికే రెండు సార్లు ప్లాన్ వేశారు అని చెబుతున్నారు.ఆగస్టు14న ప్రణయ్‌ను చంపేందుకు తొలి ప్రయత్నం చేశారు. బ్యూటీ పార్లర్‌ వద్ద ప్రణయ్‌ సోదరుడు అజయ్‌ కూడా ఉండటంతో ఎవరు ప్రణయో తెలియక అయోమయానికి గురై వెనక్కి వెళ్లారు. ఆగస్టు 22న సుభాష్‌ శర్మ మిర్యాలగూడ వచ్చాడు.

అదే రోజున ప్రణయ్‌ ఇంటికెళ్లి అతని తండ్రిని కారు కిరాయికిస్తారా? అని అడిగాడు. సెప్టెంబర్‌ తొలి వారంలో అమ్మాయిని కిడ్నాప్‌ చేసి అనంతరం ప్రణయ్‌ను చంపుదామని కూడా వ్యూహం రంచించారు. దీనికోసం హైదరాబాద్‌ నుంచి కొంతమంది రౌడీలను పిలిపించారు. కానీ వారి వ్యవహారం నచ్చని అస్గర్‌ అలీ ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.. సెప్టెంబర్‌ 14న మధ్యాహ్నాం 1.30కు హత్య జరిగింది. ఆ రోజు శర్మ బైక్‌పై కారును ఫాలో చేసాడు అని తెలియ‌చేశారు, అయితే హ‌త్య జ‌రిగిన రోజు పోలీసుల‌ను అధికారుల‌ను క‌లుస్తూ త‌న‌కు హ‌త్య‌తో సంబంధం లేదు అనేలా క్రియేట్ చేయాల‌ని మారుతిరావు దృశ్యం త‌ర‌హా ప్లాన్ వేశాడు కాని పోలీసుల‌కు చిక్కాడు.ఇంత బాధ‌లో ఉన్న అమృత‌కు స‌మంత నుంచి కూడా స‌పోర్ట్ వ‌చ్చింది, ఇలాంటి దారుణానికి పాల్ప‌డిన వారిని వెంట‌నే ఉరితీయాల‌ని, వారికి అంద‌రూ అండ‌గా ఉండాల‌ని సమంత కోరారు. ఇక మ‌హిళా సంఘాలు ప్ర‌జా సంఘాల‌తో క‌లిసి పెద్ద ఎత్తున మిర్యాల‌గూడ‌లో ర్యాలీ నిర్వ‌హించాల‌ని స‌మంత అనుకుంటున్నారు అని తెలుస్తోంది.. మ‌రి స‌మంత తీసుకున్న నిర్ణ‌యం పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.