సమంత నాగచైతన్య మజిలీ ఫస్ట్ లుక్ రిలీజ్..సామ్ చై జోడి సూపర్..

239

‘ఏమాయ చేసావే’ చిత్రంలో కలిసి నటించిన అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమికులుగా చక్కగా ఒదిగిపోయి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత నిజజీవితంలో ప్రేమికులుగా మారి ఆటో నగర్ సూర్య మనం సినిమాలలో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.పెళ్లి తర్వాత మళ్లీ జంటగా వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.వారి నిరీక్షణ ఫలించింది.

Image result for majili

నిన్ను కోరి ఫెమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మాతగా మజిలీ అనే చిత్రాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు. ‘దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్’ అనేది క్యాప్షన్.

Image result for majili first look

నాగచైతన్య, సమంత లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంది. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటిస్తున్నారు. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గోపీ సుందర్ సంగీతం, విష్ణు వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.