తనను తిట్టిన అందరికీ షాకిచ్చిన సమంత

379

సమంత..ఎంతోమందికి కలల యువరాణి.పెళ్ళైన తర్వాత కూడా ఈమె మీద తమ ప్రేమను తగ్గించుకునే వాళ్ళు లేరు.ఎప్పటికి సమంతనే మాకు ఇష్టం అంటున్నారు.పెళ్ళైన తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది.ఒకవైపు రీల్ లైఫ్ ను మరొకవైపు రియల్ లైఫ్ ను చాలా బాలన్స్ చేస్తూ జీవితం కొనసాగిస్తోంది.మరొకవైపు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆనందపరుస్తుంది.తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో పెట్టి అభిమానులకు దగ్గర అవుతుంది.అయితే ఈ మధ్య జరిగిన ఒక విషయం ఆమెను కొంతమంది టార్గెట్ చేసి మాట్లాడేటట్టు అయ్యింది.అయితే దీనికి సమంతా కూడా గట్టిగానే రిప్లై ఇచ్చింది.మరి ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన భర్త, టాలీవుడ్ స్టార్ నాగ చైతన్యతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి స్పెయిన్ దేశంలో పర్యటిస్తున్నారు. తమ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల పొట్టి డ్రెస్సులో హాట్ హాట్‌గా ఉన్న ఫోటో ఒకటి పోస్టు చేశారు. దీంతో కొందరు అభిమానులకు కోపం వచ్చింది. పెళ్లి తర్వాత ఇలాంటి డ్రెస్సులు వేయండి ఏమిటి? నిన్ను ఇలా చూడలేక పోతున్నాం. వెంటనే ఆ ఫోటోలు డిలీట్ చేయ్, ఇకపై ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయవద్దు అంటూ విమర్శించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తను వేసుకున్న డ్రెస్సుపై మిమర్శలు చేస్తూ పెళ్లి తర్వాత తాను ఎలా జీవించాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలో నీతులు చెప్పిన వారికి సమంత గట్టి సమాధానం ఇచ్చింది. మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.మీ పని మీరు చూసుకోండి, నా జీవితం గురించి ఆలోచించడం మానేయండూ ఫైర్ అయ్యారు. సమంత ఇలాంటి కామెంట్స్ అస్సలు పట్టించుకోదని, ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని తన కెరీర్లో ఆమె ఎన్నో విమర్శలను ధైర్యంగా తిప్పికొట్టిందని, కొందరు చేసే ఇలాంటి కామెంట్స్ ఆమెను ఏ మాత్రం కృంగదీయలేవు అని సమంత సన్నిహితులు అంటున్నారు. అయినా ఆమె కుటుంబ సభ్యులకు లేని అభ్యంతరం ఈ జనాలకు ఎందుకు అంటూ కొందరు ఫ్యాన్స్ సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు.అది కూడా నిజమే కదా.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సమంత డ్రెస్ మీద వస్తున్న ట్రోల్స్ గురించి అలాగే వాళ్లందరికి సమాధానంగా సమంత ఇచ్చిన సమాధానం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.