హిట్ మూవీ సీక్వెల్ లో నటిస్తున్న సమంతా?

459

అక్కినేని కోడలు సమంత కు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమైంది..ఈ ఏడాది లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ముఖ్యం గా రంగస్థలం చిత్రం ఇండస్ట్రీ లోని పలు రికార్డు లను బ్రేక్ చేసింది. అలాగే మహానటి , అభిమన్యుడు సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాదించాయి.ఆ సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతో ఆమె వరుస సినిమాలు చేస్తుంది.పెళ్ళైన తర్వాత సినిమా అవకాశాలు రావు అన్న వారి నోరు మూపిస్తుంది.

ప్రస్తుతం సమంత తెలుగు, తమిళంలో రూపొందుతున్న యూ టర్న్ సినిమాలోనూ, అలాగే నాగచైతన్య తో కలిసి ఓ సినిమాలోను నటిస్తున్నది. ఈ రెండు మినహా సమంత ఇప్పటి వరకు మరే కొత్త సినిమా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యం లో తమిళంలో సూపర్ హిట్టైన ఇరంబు తిరై (అభిమన్యుడు) సినిమాకు సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారు.

అభిమన్యుడులో డాక్టర్ రతీదేవి పాత్రలో మెప్పించిన సమంతను సీక్వెల్ లో నటించాల్సిందిగా విశాల్ భావించాడట. సమంత వరకు కూడా ఈ కబురు వెళ్లిందట. కానీ సమంత ఈ ఆఫర్ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.మరి ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..