70 వృద్దురాలిగా నటించబోతున్న సమంతా..మరీ ఇంత పెద్ద సాహసమా..

430

హీరోయిన్ సమంత విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఇటీవల కాలంలో సమంత నటించిన ప్రతి చిత్రం విజయవంతం అవుతోంది. రంగస్థలం, మహానటి, రాజుగారి గది 2 ఇలా విభిన్నమైన చిత్రాలని ఎంచుకుంటూ తన పాత్రలో అద్భుతంగా నటిస్తోంది.అందుకే దర్శకులు వెరైటీ పాత్ర కోసం సమంతాను ఎంచుకుంటున్నారు.

ఇప్పుడు సమంత మరో ప్రయోగాత్మక చిత్రంతో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఆమె తన తర్వాత సినిమాలో 70 ఏళ్ల వృద్దురాలిగా కనిపించబోతోందట. ఈ చిత్రాన్ని నందిని రెడ్డి డైరెక్ట్ చెయ్యబోతుంది.మిస్ గ్రాన్ని అనే కొరియన్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్ర కథ ప్రకారం 70 ఏళ్ల వృద్దురాలిగా ఉన్న మహిళ, అతీతమైన శక్తులు ఉన్న ఫోటో స్టూడియోకు వెళ్ళగానే నవయవ్వన యువతిగా మారిపోతుంది. ఈ పాయింట్ తోనే నందిని రెడ్డి కథ సిద్ధంచేసినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం సమంత, నందిని రెడ్డి మధ్య కథ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కనుక పట్టాలెక్కితే సమంత పెద్ద సాహాసం చెయ్యబోతుందనే చెప్పుకోవాలి.