మరోసారి అల్లు అర్జున్ తో జతకట్టనున్న సమంత?

343

టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్ లో సమంత ఉంది.పెళ్ళయాక కూడా ఈ అమ్మడి జోరు తగ్గలేదు.వరుస అవకాశాలు దక్కించుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఇప్పుడు మరొక క్రేజీ కాంబినేషన్ లో చోటు దక్కించుకుంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందే సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించబోతోందని సమాచారం.

allu arjun and samantha కోసం చిత్ర ఫలితం

ఇదివరకే ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో అల్లు అర్జున్‌ సరసన నటించింది సమంత. ఆ సినిమా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ పెయిర్ మరోసారి రిపీట్ కాబోతోందని తెలుస్తోంది.ఇది వరకూ విక్రమ్ దర్శకత్వంలో కూడా సమంత నటించింది. ‘మనం’లో సమంతది ముఖ్యమైన పాత్ర అని చెప్పనక్కర్లేదు.

vikram kumar samantha కోసం చిత్ర ఫలితం

‘మనం’, ‘24’ సినిమాల తర్వాత మళ్ళి విక్రమ్ డైరెక్షన్ లో సమంత నటించనుంది.అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉండబోతోందని సమాచారం. అదెవరు..అనేది ఇంకా తెలియడం లేదు. పలు పేర్లను పరిశీలిస్తున్నారట. సమంత వరకూ మాత్రం ఓకే అయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది.