నటనకు గుడ్ బై చెప్తున్న సమంతా..కారణం ఇదే..

583

ఏ మాయ చేసావే సినిమా ద్వారా వెండి తెర మీద అడుగు పెట్టి టాప్ హీరోయిన్ అయ్యింది సమంతా ఆ తర్వాత తన మొదటి హీరో అయినా అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.అయితే పెళ్లి తర్వాత ఆమె నటనకు దూరం అవుతుంది అనుకున్నారు.కానీ వరుసగా చిత్రాలను ఒప్పుకుని నటించారు.

అయితే వచ్చే ఏడాది నుంచి ఆమె సినిమాలు చెయ్యదంటా.కొత్త చిత్రాల్లో నటించేందుకు కొందరు దర్శకులు సమంతను కాల్షీట్లు కోరగా నటించేందుకు ఆమె నిరాకరించారు. దీంతో సమంత నటనకు స్వస్తి చెప్పనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిగురించి వివరణ ఇచ్చిన ఆమె భర్త నాగచైతన్య సమంత నటన నుంచి ఒకేసారి వైదొలగరని, కొంత విరామం తీసుకుని మళ్లీ చిత్రాల్లో నటిస్తారని తెలిపారు.

నటనకు బ్రేక్‌ ఇవ్వాలని సమంత నిర్ణయించుకోవడం వెనుక ఆంతర్యమేమిటని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇందుకు చైతన్య, సమంత బదులివ్వకుండా మౌనం వహిస్తున్నారు. ఒకవేళ సమంత త్వరలో తల్లి అవ్వబోతుందని అందుకోసమే ఈ విరామం కావచ్చని అభిప్రాయపడుతున్నారు.