స‌ల్మాన్ ఖాన్ ఇంటిలో దారుణం తమ్ముడి భార్యతో సరసాలు చేస్తూ దొరికిన టాప్ హీరో

1438

సల్మాన్ ఖాన్ కుటుంబానికి, బోనికపూర్ కుటుంబానికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. బీటౌన్ లో ఇదే విష‌యం గురించి ఎక్కువ‌గా చెప్పుకుంటూ ఉంటారు..బోనికపూర్ నిర్మాణంలో సల్మాన్ ఖాన్ పలు చిత్రాల్లో నటించాడు. బోనికపూర్, సల్మాన్ ఖాన్ ఆప్త మిత్రులుగా మారిపోయారు. కానీ అర్జున్ కపూర్ వలన సల్మాన్, బోనికపూర్ కుటుంబాల మధ్య చీలిక ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్జున్ కపూర్ తన రిలేషన్ షిప్స్ విషయంలో అనుసరిస్తున్న వైఖరే ఇందుకు కారణం అని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు తమ్ముడి భార్యతో
అర్జున్ కపూర్ బాలీవుడ్ లోని ప్రవేశించిన కొత్తల్లో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ తో డేటింగ్ చేసినట్లు వార్తలు ఉన్నాయి. వీరిద్దరూ ఘాడమైన ప్రేమలో మునిగి తేలారట. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ విడిపోయారు. అప్పట్లో ఇది బాలీవుడ్ లో పెద్ద సంచలనమే. తన చెల్లి మనసు గాయపరిచిన అర్జున్ కపూర్ కు సల్మాన్ వార్నింగ్ ఇచ్చాడని కూడా వార్తలు వచ్చాయి.పాత జ్ఞాపకాలని మరచిపోకుండా అర్జున్ కపూర్ మళ్ళీ సల్మాన్ కుటుంబాన్నే కెలికాడు. అర్జున్ కపూర్, మలైకా అరోరా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరి రిలేషన్ షిప్ అంతా తెలిసిపోయింది. మలైకా అరోరా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కు మాజీ భార్య. అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ కారణంగానే వీరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో సల్మాన్ ఖాన్ బాగా హర్ట్ అయ్యాడట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఒకప్పుడు తన చెల్లితో చెట్టాపట్టాలేసుకు తిరిగిన అతడే ఇప్పుడు తన తమ్ముడి ఫ్యామిలీలో ఇబ్బందులకు కారణం అయ్యాడని సల్మాన్ ఖాన్ అర్జున్ కపూర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు విషయంలో మౌనం వహిస్తున్న బోనికపూర్ పై కూడా సల్మాన్ ఖాన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై అతడి కుటుంబంతో సంబంధాలు కొనసాగించకూడదని కనీసం, వాళ్ళ ఇంటికి కూడా వెల్ళకూడదని సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.బోనికపూర్ నిర్మాణంలో సల్మాన్ ఖాన్ నటించిన వాంటెండ్ చిత్రం ఘనవిజయం సాధించింది, చాలా రోజుల క్రితమే బోనికపూర్ వాంటెడ్ 2 ని కూడా ప్రకటించాడు. కానీ ఇకపై ఆ చిత్రం ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అర్జున్ కపూర్ వలన బోనికపూర్, సల్మాన్ ఖాన్ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని సమాచారం. మ‌రి అర్జున్ క‌పూర్ ఇలాంటి ప‌ని చేయ‌డం ఏమిటి అని బాలీవుడ్ లోతెగ చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.. మ‌రి అత‌డి వ్య‌వ‌హార శైలిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.