సాక్ష్యం సినిమా నష్టం ఏకంగా 30 కోట్లు…బెల్లంకొండకు షాక్..

432

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా సినిమా సాక్ష్యం డిజాస్టర్ గా మిగిలిపోయింది..భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీగా నష్టాలను కూడా మిగిల్చింది..స్టార్ హీరోల రేంజ్ లో ఈ సినిమాను ఏకంగా 40 కోట్ల బడ్జెట్ తో తీసారట..వాస్తవానికి బెల్లం కొండ శ్రీనివాస్ సినిమాలకు తెరవెనుక డబ్బులు పెట్టేది ఆయన తండ్రి బెల్లం కొండ సురేష్ నేనట..కాకపోతే ఫైనాన్షియర్లు.. బయ్యర్లతో సమస్యలున్న నేపథ్యంలో వాళ్లకు దొరక్కుండా ఉండేందుకు వేరే నిర్మాతల పేర్లు తెరపైకి తీసుకొస్తారని చాలామంది అంటుంటారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే తాజాగా బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన సాక్ష్యం చిత్రం దాదాపు రూ. 30 కోట్ల నష్టాన్ని మిగిల్చిందని వినికిడి…

ఐతే ఈ చిత్రానికి రూ.40 కోట్ల బిజినెస్ జరిగిందని.. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ కైవసం చేసుకుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి రూ.10 కోట్లకు మించి షేర్ రాలేదట. దీని బట్టి చూస్తే ఈ సినిమా వల్ల సదరు సంస్థకు దాదాపు రూ. 30 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో చూడాలి. శ్రీవాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో పూజా హగ్దే హీరోయిన్ గా నటించగా , శరత్ కుమార్ , జగపతి బాబు , మీనా మొదలగు భారీ కాస్ట్ & క్రూ నటించారు.