ఇక ఆ రూమ‌ర్ల‌కు ఎండ్ కార్డ్ వేయండి సాక్ష్యం టీమ్

367

సినిమా వ‌ర్క్ మొద‌లైంది అంటే అందులో క్రూ ఎవ‌రు అనే ద‌గ్గ‌ర నుంచి సినిమా రిలీజ్ డేట్ వర‌కూ అనేక రూమ‌ర్లు వార్త‌లు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఇటువంటి రూమర్లు ఒక్కోసారి సినిమాల‌కు చాలా మైన‌స్ అవుతూ ఉంటాయి.. తాజాగా ఇలాంటి రూమ‌ర్లు సాక్ష్యం సినిమాని వెంటాడాయి. సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియాలో వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు ఈ సినిమా విడుద‌ల డేట్ ని ప్ర‌క‌టించారు.

Related image

ఈ సినిమాని జూలై 27న వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ స‌ర‌స‌న పూజ‌హెగ్డే న‌టిస్తున్నారు..శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది.. ఈ మూవీ కాన్సెప్ట్ డిఫ‌రెంట్ గా ఉండ‌టంతో ఈ సినిమా పై ఇప్ప‌టికే ఎన్నో అంచ‌నాలు పెరిగిపోయాయి.

Related image

టీజ‌ర్ ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.. పాట‌లు బాణీల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శ‌ర‌త్ కుమార్ జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.