‘సైరా, సాహో’ చిత్రాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి?

282

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘సాహో’ చిత్రం ఒకేరోజు విడుదల కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో ‘సైరా’ సినిమా రూపొందుతోంది. నయనతార అమితాబ్ బచ్చన్ సుదీప్ లాంటి హేమాహేమీలు ఈ సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

Image result for saira narasimha reddy

అలాగే ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘సాహో’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తొలుత వేసవి తొలి భాగంలో విడుదల చేయాలని భావించినప్పటికీ అప్పటికి షూటింగ్ పూర్తయినా.. నిర్మాణాంతర పనులు పూర్తి కావనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

Related image

దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు పోటీ పడనున్నాయి. దీంతో సైరా, సాహో చిత్రాలు ఒకే రోజున విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ టాలీవుడ్‌లో విస్తృతంగా నడుస్తోంది.